శ్రీరామ్ చంద్రని ఫుల్ టైమ్ యాంకర్ చేసిన ఆహా..!

ఇండియన్ ఐడెల్ ( Indian Idol )విన్నర్ శ్రీ రాం చంద్ర పాటలు పాడటం అటుంచితే ఈమధ్య అతను ఫుల్ టైం యాంకర్ గా చేస్తున్నాడు.

అదేంటి యాంకర్ గా శ్రీరాం ఎక్కడ కనిపించట్లేదే అనుకోవచ్చు.

శ్రీరామ్ చంద్ర( Sriram Chandra ) యాంకర్ గా చేసేది టీవీ షోలో కాదు ఓటీటీ లో ఆహా వారు చేస్తున్న షోలకు శ్రీరాం చంద్ర యాంకరింగ్ చేస్తున్నాడు.ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 2 లకు శ్రీరాం చంద్ర యాంకరింగ్ చేయగా లేటెస్ట్ గా సూపర్ ఉమెన్ అంటూ మరో ప్రోగ్రాం స్టార్ట్ చేయగా దానికి కూడా శ్రీరాం చంద్ర హోస్ట్ గా చేస్తున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 5( Bigg Boss Season 5 ) లో టాప్ లో నిలిచిన శ్రీరాం చంద్ర సింగర్ గా వరుస అవకాశాలు అందుకుంటాడని అనుకోగా అతను యాంకర్ గా ఫుల్ పాపులర్ అయ్యాడు.ముఖ్యంగా ఆహా ( Aha )వారికి సంబందించిన షోస్ కి అతనే ఫస్ట్ యాంకర్ గా కనిపిస్తున్నాడు.

ఆహా ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది కాబట్టి ఆహా వారు చేస్తున్న ఈ షోలు కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి.యాంకరింగ్ చేస్తున్నందుకు శ్రీరాం చంద్రకి మంచి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారని తెలుస్తుంది.

Advertisement
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

తాజా వార్తలు