వెండి తెర అయినా బుల్లితెర అయినా రన్నింగ్ రేస్ లో ఎంత మంది రన్నర్లు తక్కువ ఉంటే అంత త్వరగా విజేతలు ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది.ఇద్దరు మాత్రమే పోటీపడే రన్నింగ్ రేస్ లో ఇద్దరిలో మొదటి లేదా రెండో ప్లేస్ తీసుకోవాల్సిందే కదా.
ఇప్పుడు శ్రీముఖి ( Srimukhi ) కూడా అచ్చంగా ఇలా రన్నింగ్ రేస్ లో వెళ్తోంది అది కూడా అతి తక్కువ మంది రన్నర్లతో.అందుకే ఆమె అన్ని చానల్స్ లో విజేతగా కనిపిస్తోంది అసలు విషయం ఏమిటి అంటే ప్రస్తుతం యాంకర్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటున్నారు అందుకే ఏ ఛానల్ ఓపెన్ చేసిన శ్రీముఖి యాంకరింగ్ మాత్రమే కనిపిస్తుంది.
అరిచి, గీపెట్టి ఏదో ఒక రకంగా షోను రక్తి కట్టించడంలో శ్రీముఖి తర్వాతే ఎవరైనా.పైగా వేసుకునే బట్టలకు కూడా అడ్డు అదుపు ఏమీ ఉండదు కాబట్టి ఆమెకు అంగంగా ప్రదర్శన చేయకపోయినా ఒకరకమైన ఎక్స్పోజింగ్ తో మొత్తానికి బాగానే లీడ్ చేయగలుగుతోంది.

నిజానికి ఇప్పటికే యాంకర్ సుమ( Suma ) చేసే యాంకరింగ్ తో మోనాటని వచ్చేసింది.అందుకే ఆమె ప్రస్తుతం ఒకే ఒక్క షో చేస్తుంది అది సుమ అడ్డా. ఈ షో రేటింగ్ కూడా అధ్వానంగానే ఉంది అయినా కూడా సుమ ఓన్లీ ఒకే ఒక చోతో నడిపిస్తోంది.మరి కావాలని తగ్గిస్తుందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా తెలియదు కానీ ఈవెంట్స్ లో కూడా ఆమె తక్కువగానే కనిపిస్తుంది ఇటీవల కాలంలో.
అందుకే సుమక్క ఈ యాంకరింగ్ పరుగు పందెం లో పక్కకు వెళ్లిపోయిందనే అనుకోవాలి.సుమ తర్వాత అనసూయ ( Anasuya ) లాంటి మరొక హాట్ యాంకర్ కూడా చాలా రోజుల క్రితమే యాంకరింగ్ మానేస్తున్నట్టుగా ప్రకటించింది.
జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది, చిన్న చిన్న ఈవెంట్స్ మానేసింది, కేవలం సినిమాలపైనే ఆమె దృష్టి కేంద్రీకరించింది.అందుకే అనసూయ డక్ అవుట్ అని అనుకోవచ్చు.

రష్మి ( Rashmi ) లాంటి యాంకర్స్ ముందు నుంచి ఎక్కడ పెద్దగా కనిపించింది లేదు జబర్దస్త్ అయితే ఎవరూ పట్టించుకోవడం లేదు అందుకే శ్రీముఖి మాత్రం ప్రస్తుతం అన్ని చానల్స్ లో కనిపిస్తుంది మాటీవీలో బేబీ జోడి జీ వంటి రియాలిటీ షో కాకుండా ఏదైనా స్పెషల్ ప్రోగ్రాం ఉంది అంటే ఖచ్చితంగా అందుకు శ్రీముఖి మాత్రమే యాంకరింగ్ చేయాలి అనే పరిస్థితి కనిపిస్తోంది.ఇక ఇలాగే కొనసాగితే అతి త్వరలో ఆమె నెంబర్ వన్ స్టార్ యాంకర్ గా కొనసాగే అవకాశం ఉంది.
