Sreeleela : శ్రీలీల రేంజ్ మాములుగా లేదుగా.. క్రేజీ ఆఫర్ ఇచ్చిన ఎన్టీఆర్?

టాలీవుడ్ లో ఇప్పుడు ఏ కొత్త సినిమా వచ్చిన అందులో ముందు హీరోయిన్ గా శ్రీ లీల( Sreeleela ) పేరు వినిపిస్తుంది.పైగా చిన్నచిన్న సినిమాలు కాకుండా స్టార్ హీరోల సినిమాలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తుంది ఈ బ్యూటీ.

 Srileelas Range Is Not Normal Ntr Gave A Crazy Offer-TeluguStop.com

చేతినిండా ప్రాజెక్టులతో ఇప్పటికే బిజీగా ఉన్న ఈ బ్యూటీ.మళ్లీ కొత్తగా వచ్చిన సినిమాలకు కూడా సైన్ చేస్తూ పోతుంది.

అన్ని సినిమాలకు కరెక్ట్ డేట్స్ ఇచ్చేసి మళ్లీ కొత్తవి కూడా సెట్ చేసుకుంటుంది.ఇక ఏ హీరో అయిన కూడా ముందుగా తమ సినిమాలలో శ్రీ లీలనే ఎంచుకుంటున్నారు.

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కూడా ఈ బ్యూటీ ని ఒక సినిమాకు ఆఫర్ చేశాడు.ఇంతకు ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శ్రీలీల తొలిసారి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.నటన పరంగా కూడా మంచి స్కిల్స్, మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్, మంచి అందం ఇలా అన్ని విషయాలలో పర్ఫెక్ట్ ఫిగర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికింది.

దీంతో రవితేజ నటించిన ధమాకా సినిమాలో అవకాశం అందుకోగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

Telugu Dhamaka, Gita, Nitin, Pawan Kalyan, Raviteja, Srisri, Tollywood-Movie

ఈ సినిమా విడుదలయ్యాక చాలామంది శ్రీ లీల కోసం కూడా చూసిన వాళ్ళు ఉన్నారని చెప్పాలి.ఈ సినిమా తర్వాత శ్రీ లీలకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి.ఏకంగా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఈ బ్యూటీ కి అవకాశం ఇస్తామంటూ వచ్చారు.

అలా వచ్చిన వారిని నిరాశ పెట్టకుండా.అందరికీ కమిట్మెంట్ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

దాంతో ప్రస్తుతం తను పవన్ కళ్యాణ్, బాలయ్య, మహేష్ బాబు, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా మరికొంతమంది స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని.అన్ని సినిమాలకు డేట్స్ ఫిక్స్ చేసుకొని ఏ సినిమాకు కూడా బ్రేక్ రాకుండా వరుస పెట్టి షూటింగ్ లలో పాల్గొంటుంది.

దీంతో నిన్న మొన్న వచ్చిన ఈ హీరోయిన్ కి ఇంత క్రేజీ రావటంతో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఈమెపై బాగా కుళ్ళు కుంటున్నారని వార్తలు కూడా వినిపించాయి.

Telugu Dhamaka, Gita, Nitin, Pawan Kalyan, Raviteja, Srisri, Tollywood-Movie

ఎందుకంటే వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది కాబట్టి.ఆ అవకాశాలు తాము అందుకోకపోవడంతో బాగా నిరాశ చెందినట్లు తెలుస్తుంది.ఇక శ్రీ లీల అభిమానులు మాత్రం శ్రీ లీల క్రేజ్ చూసి ఫిదా అవుతున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా.జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ బ్యూటీకి ఒక అవకాశం ఇచ్చాడు.

జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది, ప్రణతి సోదరుడు.నితిన్.

ఎన్టీఆర్ సపోర్టుతో ఇండస్ట్రీకి పరిచయం కాగా ప్రస్తుతం ఆయన శ్రీశ్రీశ్రీ రాజావారు( Sri Sri Sri Raja Vaaru ) సినిమాను పూర్తి చేశాడు.

Telugu Dhamaka, Gita, Nitin, Pawan Kalyan, Raviteja, Srisri, Tollywood-Movie

ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.అంతలోపే మరో సినిమాకు సైన్ చేశాడు.ఇక ఈ సినిమాను గీత ఆర్ట్స్ వారు నిర్మించనున్నట్లు తెలిసింది.

ఇక టాప్ మోస్ట్ దర్శకుడిని కూడా ఈ సినిమాకు తీసుకున్నట్లు తెలిసింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నారట మేకర్స్.

అంతేకాదు ఎన్టీఆర్ కూడా ఆమె పేరుని సజెస్ట్ చేసినట్టు తెలిసింది.దీంతో ఈ బ్యూటీ మరో కొత్త ప్రాజెక్టును లైన్లో పెట్టుకుంది అని తన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

పైగా ఎన్టీఆర్ పిలిచి మరి అవకాశం ఇవ్వటం అనేది చూస్తుంటే ఆ బ్యూటీ క్రేజ్ ఏంటో ఇక్కడ అర్థం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube