శ్రీలీల( Sreeleela ) డాన్సరా లేక నటి మాత్రమేనా ? అని ఎవరిని అడిగిన టక్కున ఆమె డాన్సులకు మాత్రమే పనికొస్తుంది అని సమాధానం వస్తుంది.కానీ ఆమె మాత్రం అలా అనుకోవడం లేదు.
నేను మంచి నటిని, కేవలం డాన్స్ ల కోసం నన్ను వాడుకుంటాను అంటే కుదరదు.ఎంత పెద్ద సినిమా ఆఫర్ వచ్చినా కూడా గేటు బయట నుంచి బయటకు పంపించేస్తాను కానీ ఇకపై పర్ఫామెన్స్ కి స్కోపులేని పాత్రలు చెయ్యను అంటూ భీష్ముంచుకొని కూర్చుంది శ్రీలీల.
రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) స్కూల్ నుంచి వచ్చిన ఏ నటి అయినా మంచి పెర్ఫార్మర్ అవుతుంది లేదా మంచి గ్లామర్ రోల్స్ కి పనికొస్తుంది అని అంతా అనుకుంటారు.అందువల్లే శ్రీలీల మొదట్లో గ్లామర్ డాల్ అని అంతా భావించారు.
పెళ్లి సందడి సినిమా( Pelli SandaD Movie ) పరాజయం పాలైనా కూడా ఏడాది పాటు ఖాళీగానే ఉంది ఈ అమ్మడు.

ఆ తర్వాత ధమాకాలో రవితేజకు దీటుగా దుమ్ము దులిపి అందరి దృష్టిని ఒక్కసారి ఆకర్షించింది.ఇక అప్పటి నుంచి డాన్స్ లకు మాత్రమే కేరాఫ్ అడ్రస్ గా ఈ అమ్మడును అందరూ ట్రీట్ చేస్తూ వచ్చారు.స్కంద,( Skanda ) ఆదికేశవ,( Adikesava ) గుంటూరు కారం( Guntur Karam ) సినిమాల్లో ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ మరో రేంజ్ లో ఉంది.
అయితే డాన్స్ లకు ఏ డ్యాన్సర్ ని పెట్టుకున్నా సరిపోతుంది.కోట్లకు కోట్లు కుమ్మరిచ్చి హీరోయిన్ ని ఎందుకు పెట్టుకుంటారు.అందుకే నేను ఇకపై డ్యాన్సులు చేసే ప్రసక్తే లేదు అంటుంది ఈ అమ్మడు.తను అలాంటి తప్పులు చేయబట్టే అందరూ డాన్సర్ గా భావిస్తున్నారని పర్ఫామెన్స్ కి స్కోపు లేకపోవడం వల్లే తనకు మళ్ళీ కొత్త పాత్రలు రావడం లేదని వచ్చిన డ్యాన్సర్ పాత్రలు మాత్రమే వస్తున్నాయి అంటూ వాపోతోంది.

ఇటీవల కాలంలో ఆమె కొత్త చిత్రాలను ఒప్పుకోవడం లేదట.గౌతం తిన్ననూరి,( Goutam Tinnanuri ) విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా తర్వాత ఆమె ఆచితూచి అడుగులు వేస్తోందట.భగవంత్ కేసరి సినిమా మినహా ఎవరు కూడా తనలోని నటిని గుర్తించలేదని అలాంటి పర్ఫామెన్స్ మాత్రమే ఇకపై చూపిస్తానని అందుకే మంచి అవకాశాలు ఇవ్వండి అంటూ దర్శకనిర్మాలను అడుగుతుందట.మరి ఇకనైనా ఆమెలోని పర్ఫార్మర్ ని వాడుకుంటారా లేక కుప్పిగంతులకే పరిమితం చేస్తారా అనేది మన దర్శక నిర్మాతలపైనే ఆధారపడి ఉంది.
ఈ విషయం తెలియాలంటే ఎటు ఇంకొన్నాళ్ళు పడుతుంది.