ఇండియా ఇంగ్లాండ్ టీమ్( India England Team ) ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆడిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విక్టరీ సాధించింది.ఇక దీంతో ఇండియా 4-1 తేడాతో ఈ సిరీస్ ని కైవసం చేసుకుంది.
ఇక ఐదో టెస్ట్ ఆడుతున్న క్రమంలో కేవలం మూడో రోజుకే మ్యాచ్ ఫలితాన్ని రాబట్టడం అంటే అంత ఆషామాషీ కాదు.ఇక ఇలాంటి సందర్భంలో ఇండియన్ టీం పూర్తిగా ఈ మ్యాచ్ ను వన్ సైడ్ చేసేసింది.
మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, గిల్( Rohit Sharma, Gill ) ఇద్దరు అద్భుతమైన సెంచరీలు చేశారు.

ఇక అందులో భాగంగానే ఇండియన్ టీం మొదటి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది.ఇక ఇది ఇలా ఉంటే మన బ్యాట్స్ మెన్స్ కు తగ్గట్టుగానే మన బౌలర్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు.కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విని( Kuldeep Yadav, Ravichandran Ashwini ) ఇద్దరూ సూపర్ గా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ టీం ని 218 పరుగులకే ఆల్ అవుట్ చేయడం అనేది టీమ్ కి చాలా బాగా కలిసి వచ్చిన అంశమనే చెప్పాలి.
ఇక ఇందులో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బౌలర్ల మీద ప్రెషర్ ను పెంచారు.ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టీమ్ 195 పరుగులకే అలౌట్ అవ్వడం 64 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించింది.

ఇక సెకండ్ ఇన్నిగ్స్ లో అశ్విన్ 5 వికెట్లు తీశాడు, కుల్దిప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు.ఇక ఈ మ్యాచ్ లో అత్యుత్తమమైన పర్ఫామెన్స్ ఇచ్చినందుకు గాను కులదీప్ యాదవ్ అని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ఇక ఈ సిరీస్ మొత్తానికి భారీ పరుగులను సాధించిన యశస్వి జైశ్వాల్( Yashaswi Jaishwal ) ను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ప్రకటించారు.ఇక దీంతో ఇండియన్ టీం సిరీస్ ను సొంతం చేసుకోవడమే కాకుండా 2025 లో ఆడబోయే డబ్ల్యుటిసి ఫైనల్ కు అర్హత సాధించడం కోసం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి…
.






