టీమిండియా దూకుడుకు శ్రీలంక కళ్లెం వేయగలదా..?!

ఫిబ్రవరి 24 నుంచి టీమిండియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ స్టార్ట్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ సిరీస్ లో మొత్తంగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.24న ఫస్టు టీ20 మ్యాచ్ జరగనుండగా ఇప్పటికే టీమిండియా జట్టు లక్నో చేరుకుంది.ఇక 26, 27వ తేదీల్లో సెకండ్, థర్డ్ టీ20 మ్యాచ్‌లు వరుసగా నిర్వహిస్తారు.

 Srilanka Tour Of India Team India, Player's, Srilanka , Latest News , Sport Upa-TeluguStop.com

అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సిరీస్ లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఇప్పుడు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.నిజానికి టీమిండియా చాలా దూకుడుగా ఆడుతూ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలుస్తోంది.

ఇలా దూకుడుగా ఆడుతున్న టీమిండియాకి శ్రీలంక జట్టు కళ్లెం వేయగలదా అనేది ఇప్పుడు తెలుసు కుందాం.

ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో రెండూ తలపడ్డప్పుడు శ్రీలంక ఎక్కువ మ్యాచ్ ల్లో విన్ అయ్యిందా?? లేదా మన టీం ఇండియానా ఎక్కువ మ్యాచ్‌ల్లో విన్ అయ్యిందా? అనేది తెలుసుకునేందుకు గత గణాంకాలను పరిశీలిద్దాం.గత రికార్డుల ప్రకారం, ఇప్పటివరకు భారత్, శ్రీలంక జట్లు 22 టీ20 మ్యాచ్‌లలో తలపడ్డాయి.వీటిలో 14 మ్యాచ్‌లలో భారత జట్టు గెలవగా.కేవలం 7 మ్యాచ్‌ల్లోనే శ్రీలంక విజయం సాధించింది.ఓ మ్యాచ్‌ డ్రా అయింది.అయితే ఇండియాలో జరిగిన మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు, శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు భారత్ నెగ్గింది.శ్రీలంక మాత్రం స్వదేశంలో 3, ఇండియాలో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

ఈ రికార్డులను బట్టి చూస్తుంటే ఇండియా జట్టు శ్రీలంకపై ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఆధిపత్యం చూపిస్తోందని తెలుస్తోంది.

అంతే కాదు ఇండియా, శ్రీలంక టీ20ల్లో తలపడిన మ్యాచ్‌ల్లో నమోదైన రికార్డులన్నీ ఇండియన్ క్రికెటర్ల పేరు మీదనే ఉండటం విశేషం.ఇప్పుడు కూడా రికార్డులను సృష్టించడానికి స్టార్ ఇండియన్ ప్లేయర్లు రెడీ అయిపోయారు.దీన్నిబట్టి టీమిండియాకి శ్రీలంక కళ్లెం వేయలేదని అర్థమవుతోంది.

రేపు జరగబోయే తొలి మ్యాచ్ తో ఏ జట్టు విజయం సాధిస్తుందో కొంత వరకు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube