బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో మొత్తానికి రెండు జంటల మధ్య చిచ్చుపెట్టి పక్కకు తప్పుకుంది.గతంలో సీజన్ 5 పూర్తవగ అందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా షణ్ముఖ్, సిరి ల గురించి మాత్రం బాగా వైరల్ గా మారింది.వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
మొదట వీరిద్దరు కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కలిసి చేశారు.ఆ తర్వాత ఇద్దరికీ బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వచ్చింది.ఇక బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న వీరిద్దరూ తమ స్నేహాన్ని మరింత బలపరుచుకున్నారు.ఏకంగా హగ్గు లతో, ముద్దులతోనే స్నేహమని ముసుగు వేసి రెచ్చిపోయారు.
దాంతో వీరిద్దరూ హౌస్ లో ఉండగానే బయట నెగెటివిటీ మోశారు.
ఇక వీరిద్దరి మధ్య జరుగుతున్న రొమాన్స్ ను చూసి నాగార్జున కూడా ఫైర్ అయి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
అయినా కూడా వీరిద్దరూ అలాగే రెచ్చిపోయారు.నిజానికి షణ్ముఖ్ సోషల్ మీడియా స్టార్ట్ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
కానీ సిరితో అల ప్రవర్తించడంతో దీప్తి సునైనా షన్ను కు బ్రేకప్ చెప్పింది.

ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉంటే సిరి కూడా బిగ్ బాస్ షో ముందు తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.ఇక షో తర్వాత వీరిద్దరి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
కానీ చాలావరకు శ్రీహన్ కూడా సిరి తో బ్రేక్ అప్ అంటాడు అనుకున్నారు.కారణం అతనికి కూడా తెలుసు.
ఎందుకంటే సిరి షన్ను తో అలా క్లోజ్ గా మూవ్ అవ్వడం తో తట్టుకోలేక బిగ్ బాస్ షో వేదికపైకి వచ్చి తన మనసుకు తగిలే విధంగా బాగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో సిరిని శ్రీహాన్ బాగా అర్థం చేసుకున్నాడని అందరూ అనుకున్నారు.
అయినా కూడా ఆమె మితిమీరి ప్రవర్తించడంతో.కనీసం శ్రీహన్ తనని షో తర్వాత కూడా కలవడానికి ఇష్టపడలేదని తెలిసింది.

అలా కొన్ని రోజుల నుండి శ్రీహన్ తనను దూరం కూడా పెట్టాడు అని తెలిసింది.ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.ఇక సోషల్ మీడియాలో కూడా ఇద్దరు దిగిన ఫోటోలను కూడా పంచుకుంటున్నారు.ఇదిలా ఉంటే తాజాగా వీరికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అందులో శ్రీహాన్ పాట పాడుతూ ఉండగా సిరి దానిని రహస్యంగా వీడియో తీసింది.ఇక మళ్లీ పాడమని అనటంతో వెంటనే శ్రీహాన్ అది చూసి పోవే అంటూ వెటకారం చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.







