ఈరోజు నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.బాలయ్య బర్త్ డే సందర్భంగా ఫస్ట్ హంట్ టీజర్ పేరుతో విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటికే ఈ టీజర్ కు ఏకంగా 3.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.ఊరమాస్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తన సినీ కెరీర్ లో బాలయ్య భిన్నమైన పాత్రల్లో నటించారు.అయితే బాలయ్యకు ఇప్పటివరకు ఒక్క కోరిక మాత్రం తీరలేదని సమాచారం.
సుల్తాన్, పలు సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించిన బాలకృష్ణ భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలో పూర్తిస్థాయి విలన్ గా భయంకరంగా కనిపిస్తూ నటించాలని భావిస్తున్నారు.అయితే ఈ కోరిక మాత్రం ఇప్పటివరకు తీరలేదు.
అలాంటి స్క్రిప్ట్ బాలయ్య దగ్గరకు వస్తే మాత్రం బాలయ్య కచ్చితంగా నటించే అవకాశం ఉంది.
కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి తనకు ఎలాంటి సమస్య లేదని బాలయ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాలలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.బాలయ్య 107వ సినిమాకు జై బాలయ్య, రెడ్డిగారు, వీరసింహారెడ్డి మరికొన్ని టైటిల్స్ ను పరిశీలిస్తుండగా ఈ టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీకి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

బాలయ్య సినిమాకు టైటిల్ క్రేజీగా ఉండాలని భావించి అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య వచ్చే ఏడాది ఇదే సమయం లోపు రెండు సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.బాలయ్య మరెన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
సినిమాసినిమాకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్న హీరోలలో బాలకృష్ణ ఒకరు.







