వైభవంగా ప్రారంభమైన శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర మహోత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి వేద పండితుల అధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారికి ఇష్టమైన పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించి నైవేద్యం,హారతులు సమర్పించారు.అనంతరం అమ్మవారు శాకాంబరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మూడు రోజుల పాటు కన్నులపండువగా నిర్వహించే మహంకాళీ ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉదయం అమ్మవారికి బోనాల సమర్పణ ఉంటుందని ఆలయ కమిటీ ఛైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.బోనం సమర్పించు భక్తులు ఎవరికి వారే అమ్మవారికి బోనాలు తీసుకురావాలని పేర్కోన్నారు.

తిరిగి సాయంత్రం 4 గంటలకు తొట్టెండ్లు,గొర్రె పొట్టేళ్ల ఫలహార బండి, పోతరాజులు విజయవాడ ప్రభలతో వైవిధ్యమైన వేషధారణతో ప్యాడ్ బ్యాండ్ మేళాలతో పట్టణ పురవీధుల గుండా అమ్మవారి శోభాలంకరణతో ఊరేగింపు జరుపనున్నట్లు తెలియజేశారు.మూడవ రోజు సోమవారం అమావాస్యన మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement

ఈ బోనాల జాతర మహోత్సవాలలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పట్టణ ప్రజలు,భక్తులు విచ్చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?
Advertisement

Latest Rajanna Sircilla News