ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ మనవడుకు వైద్య సేవలు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ మనవడుకు వైద్య సేవలు.ఆశ్చర్యపోయిన ప్రభుత్వ అధికారులు.

 Sri Satya Sai District Collector P Basanth Kumar Grandson Treatment At Primary H-TeluguStop.com

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన మనవడికి వైద్య సేవలు అందించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్.ప్రజలు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు చేపించుకోవాలి.సాధారణంగా ఐఏఎస్ స్థాయిలో తమ కుటుంబంలో ఆరోగ్య విషయంలో ఏవైనా ఇబ్బందులు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళతారు.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు.మనవడికి వైరల్ ఫీవర్ వస్తే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా తన మనవడికి వైద్య సేవలు అందించి జిల్లా కలెక్టర్ ఆదర్శంగా నిలిచారు.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ తన మనవడు కిరీటి విరాజ్ (వయసు 3 ఏళ్ళు) మూడు రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడేవాడు.తన మనవడికి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య చికిత్స అందించాలని నిర్ణయించి పుట్టపర్తి పట్టణ పరిధిలోని ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తన కుటుంబ సభ్యులతో పాటు చిన్నారిని శుక్రవారం రాత్రి తీసుకువచ్చారు.

Telugu Grandson, Basanth Kumar, Kireeti Viraj, Primary, Sri Satya Sai-Press Rele

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిసిహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, మెడికల్ ఆఫీసర్ నాగరాజు నాయక్ చిన్నారిని పరీక్షించారు.ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తోంది,తదితర వివరాలను ఆరా తీశారు.అర్బన్ ల్యాబ్ టెక్నీషియన్ స్వప్న చిన్నారికి బ్లడ్ టెస్ట్ చేసి,బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్ నిర్ధారించారు.

అనంతరం చిన్నారికి వైరల్ ఫీవర్ వచ్చినట్లు నిర్ధారించి జ్వరం తగ్గేందుకు పారాసిటిమల్, అమాక్సిలిన్ సిరప్, సిపిఎం సిరప్,జలుబు తగ్గేందుకు అవిల్ మాటలను అందించారు.మూడు రోజుల్లోగా జ్వరం నుంచి కోలుకునేందుకు అవకాశం ఉందని డిసిహెచ్ఎస్,మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube