అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ).ఈ సినిమా ఆ నేడు విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే.
బాలకృష్ణ అంటే మాస్ కథాంశం, దర్శకుడు అనిల్ రావిపూడి అంటే కామెడీ కంటెంట్.అలాంటి వీరిద్దరూ పంథా మార్చి చేసిన సినిమానే భగవంత్ కేసరి.
తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టాల్సిందేనని బాలకృష్ణ ఒక వేడుకలో అన్నారు.ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమాకు మంచి హిట్ టాక్ వస్తోంది.
దాన్ని బట్టి ఈ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
యాక్షన్, కామెడీ అంశాలు అంతర్లీనంగా ఉంటాయి.హీరో క్యారెక్టరైజేషన్‌ను బట్టి ఈ సినిమాకి బ్రో.ఐ డోంట్ కేర్ టైటిల్ పెట్టాలనుకున్నారు.
కానీ, మనిషి పేరుతో కూడిన టైటిల్ ఉంటేనే ఎక్కువ రోజులు ప్రేక్షకులు ఆ సినిమాతో ప్రయాణం చేస్తారనిపించి భగవంత్ కేసరి టైటిల్ ని ఫిక్స్ చేశారట.ఐ డోంట్ కేర్ ని ట్యాగ్‌లైన్ చేశారు.
కాగా హీరో బాలకృష్ణకు ఇది 108వ సినిమా కాగా దర్శకుడు అనిల్ రావిపూడికి 7వ చిత్రం.ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు నేలకొండ భగవంత్ కేసరి.
ఇందులో బాలకృష్ణ( Balakrishna ) విభిన్న గెటప్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని సన్నివేశాలను రూపొందించారు.
ఇందులో బాలకృష్ణ వేషధారణే కాకుండా సంభాషణలు కూడా కొత్తగా ఉంటాయి.తెలంగాణ మాండలికంలో ఆయన చెప్పిన డైలాగ్స్‌కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.ఈ నేలకొండ భగవంత్ కేసరితో తలపడే విలన్ పాత్ర పేరు రాహుల్ సంఘ్వి. బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్( Arjun Rampal ) ఈ క్యారెక్టర్ ప్లే చేశారు.
ఆయనకు ఇదే తొలి తెలుగు సినిమా.డబ్బింగ్ కూడా చెప్పడం గమనార్హం.
ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.ఆమె భగవంత్ కేసరి భార్య కాత్యాయనిగా నటించింది.
భగవంత్ కేసరి గారాల పట్టి విజ్జి పాపగా ప్రస్తుత టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల( Sreeleela ) నటించింది.సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసిన ఈ సినిమా నిడివి 2 గంటల 44 నిమిషాలు.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.