ఏపీ ప్రభుత్వ వినూత్న నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.ఏమిటా నిర్ణయమంటే….

 Special Forces To Be Implemented For Tourists’ Security-TeluguStop.com

టూరిస్టుల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు ఫోర్సును ఏర్పాటు చేయబోతోంది.పర్యాటకుల భద్రత కోసం ఏ రాష్ర్టంలోనూ ప్రత్యేక పోలీసు ఫోర్సు ఉండకపోవచ్చు.

పర్యాటక ప్రాంతాల్లో శాంతి భద్రతలను, ఇతర అంశాలను సాధారణ పోలీసులే చూస్తుంటారు.సహజంగానే వారిపై భారం ఎక్కువగా ఉంటుంది.

అదీగాక పర్యాటక ప్రాంతాల్లోనే నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి.ఒకప్పుడు దొంగతనాలు మాత్రమే జరిగేవి.

కాని కొంతకాలంగా మహిళపై అత్యాచారాలు కూడా ఎక్కువయ్యాయి.మన పర్యాటక ప్రాంతాలను చూద్దామని ఎంతో ఆసక్తిగా వ్యయప్రయాసలకోర్చి వచ్చే విదేశీ మహిళలపై దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు.

అత్యాచారాలు చేశాక హత్యలూ చేస్తున్నారు.చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో కొన్ని దేశాలు తమ పర్యాటకులకు ‘మీరు భారత్‌కు వెళ్లకండి.

అక్కడ అత్యాచారాలు జరుగుతాయి’ అని హెచ్చరించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.అప్పట్లో చిరంజీవి తమ ప్రభుత్వం పర్యాటకులకు పూర్తి భద్రత కల్పిస్తుందని అన్నారు.సరే…అది కాలేదనుకోండి.పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయాలనే చంద్రబాబు నిర్ణయం టూరిస్టుల్లో విశ్వాసం కలిగిస్తుంది.

దీన్ని ఎంత త్వరగా అమలు చేస్తే అంత మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube