దొంగ డిగ్రీ మంత్రి?

మన ప్రజాప్రతినిధుల్లో చాలామంది మోసగాళ్లున్నారు.మాఫియా ముఠాలవారున్నారు.

 Delhi Law Minister Faked Law Degree?-TeluguStop.com

హత్య కేసులున్నవారున్నారు.అక్రమ సంపాదనపరులకు ఇక లెక్కేలేదు.

వీరిలో కొందరు మంత్రులు కూడా అవుతున్నారు.ఇలాంటి ‘దొంగ మంత్రి’ ఒకాయన బయటపడ్డాడు.

ప్రస్తుతం ఇది ఆరోపణే అనుకోండి.అయినా నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా…! మాది నీతి నిజాయితీగల పార్టీ, పారదర్శకతకు మారు పేరు అని చెప్పుకునే ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వంలోనే దొంగ మంత్రి ఉన్నాడు.

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ తోమర్‌కు ‘లా డిగ్రీ’ బూటకపు డిగ్రీ అని ఆరోపణలు వచ్చాయి.అన్యాయాలను రూపుమాపి న్యాయాన్ని రక్షించాల్సిన మంత్రే దొంగ డిగ్రీ ఉన్న వాడైతే ఎలా? తోమర్‌కు తాము లా డిగ్రీ ప్రదానం చేసినట్లు తమ వద్ద ఎటువంటి రికార్డులు లేవని బిహార్‌ విశ్వవిద్యాలయం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.దీంతో న్యాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.కాని మంత్రి తిరస్కరించారు.తన లా డిగ్రీ వంద శాతం ‘పక్కా’ అని తోమర్‌ చెప్పారు.ఈ దొంగ డిగ్రీ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంత్రిని ఆదేశించారు.

ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube