తెలంగాణ ప్రభుత్వంలో రెబల్ మంత్రిగా ఈటెల తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూ కేసీఆర్ ను ఇరుకున పెడుతున్న పరిస్థితి ఉంది.
తనకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదని టీఆర్ఎస్ పై మంత్రి ఈటెల అలకబూనిన విషయం తెలిసిందే.ఈటెల, కేసీఆర్ కు ఎక్కడ చెడింది అన్న విషయం ఇంకా తెలియ రాకున్నా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఉంది.
ఈ విధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల వల్ల ప్రజలు అభివృద్ధి చెందరని ఏకంగా ప్రభుత్వ పథకాలపై బహిరంగంగా విమర్శలు చేయడంతో రాజకీయ వర్గాలలో ఒక్కసారిగా కలకలం రేగింది.
తాజాగా మరో సారి ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వాలు తేలికగా తీసుకుంటున్నాయని, అది ఎప్పటికైనా మన మెడకు చుట్టుకుంటదని, ప్రభుత్వాలు ఈ విషయాన్ని మరిచి నేల విడిచి సాము చేయవద్దని అన్నారు.అయితే కేసీఆర్-ఈటెల మధ్య రాజీ కుదిరినదని ప్రచారం జరిగినా అందులో నిజం లేదని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయ చట్టాలకు మొదట కేసీఆర్ వ్యతిరేకించడం, తరువాత సమర్థించడంతో ఈటెల వ్యక్తిగతంగా ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.మరి కేసీఆర్-ఈటెల మధ్య ఈ మాటల యుద్దం ఎప్పుడు చల్లారుతుందో చూడాలి.