బాలు గారి ఆరోగ్యంపై తాజా హెల్త్‌ బులిటెన్‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతూనే ఉంది.గత అయిదు రోజులుగా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైధ్యులు చెబుతున్నారు.

చెన్నైలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.కరోనాతో ఆసుపత్రిలో జాయిన్‌ అయిన బాలు గారు ఆ తర్వాత శ్వాస సంబంధింత సమస్యతతో బాధపడుతున్న కారణంగా ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌ ద్వారా శ్వాస అందిస్తున్నట్లుగా వైధ్యులు కొన్ని రోజుల క్రితం ప్రెస్‌ నోట్‌ విడుదల చేయడం జరిగింది.

తాజాగా ఆసుపత్రి వర్గాల వారు మరో ప్రెస్‌ నోట్‌ను విడుదల చేయడం జరిగింది.బాలు గారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు అంటూ ప్రెస్‌ నోట్‌ లో పేర్కొన్నారు.అయితే ఆయన వైధ్యంకు స్పందిస్తున్నట్లుగా మాత్రం చిరంజీవి చెప్పుకొచ్చారు.

Advertisement

ఖచ్చితంగా ఆయన మళ్లీ మైక్‌ ముందుకు వచ్చి పాటలు పాడి అందరిని అలరిస్తారనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ కూడా తన తండ్రి త్వరలోనే కోలుకుంటాడని, ప్రస్తుతానికి ఆయన ఐసీయూలోనే ఉన్నారు అంటూ పేర్కొన్నాడు.

ఎస్పీ బాలు అనారోగ్యంతో సినీ వర్గాల్లో మరియు ఆయన ఫ్యాన్స్‌ లో ఆందోళన వ్యక్తం అవుతోంది.దాదాపుగా 40 వేల పాటలు పాడి రికార్డు దక్కించుకున్న బాలు అత్యధిక భాషల్లో పాటలు పాడిన వ్యక్తిగా కూడా రికార్డును దక్కించుకున్నాడు.

దేశంలోని అన్ని చోట్ల బాలుకు అభిమానులు ఉన్నారు.అలాంటి ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో అంతా కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?
Advertisement

తాజా వార్తలు