మహిళల T20 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ కి చేరుకున్న సౌత్ ఆఫ్రికా..!!

మహిళల టి20 వరల్డ్ కప్ టోర్నీలో మొదటి సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య నిన్న జరిగింది.

ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్న సంగతి తెలిసిందే.

అయితే శుక్రవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య జరిగింది.రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది.

ఈ విజయంతో మొదటిసారి మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీలో సౌత్ ఆఫ్రికా ఫైనల్ కి చేరుకొని చరిత్ర సృష్టించింది.పైగా మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నీ సౌత్ ఆఫ్రికా లోనే జరగటం విశేషం.

దీంతో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించటంతో.ఆ దేశ క్రికెట్ ప్రేమికులు సంబరాలు చేసుకుంటున్నారు.మొదటి నుండి చాలా దూకుడుగా ఆడుతూ మెరుగైన రన్ రేట్ తో సెమీ ఫైనల్ కి చేరుకుంది.

Advertisement

సెమీస్ లో ఇంగ్లాండ్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్ కీ చేరుకోవడం జరిగింది.సునే లాస్ నాయకత్వంలో సౌత్ ఆఫ్రికా జట్టు.మంచి ఫామ్ లో ఉంది.

కాగా ఆదివారం బలమైన ఆస్ట్రేలియా జట్టుతో సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.ఫైనల్ లో ఆసీస్ పై గెలిస్తే మహిళల సఫారీ టీం తొలిసారి ప్రపంచ కప్ సాధించినట్లు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు