సిద్దు కామెంట్స్ ఎఫెక్ట్! కపిల్ శర్మ షో నుంచి అవుట్!

క్రికెటర్ గా, రాజకీయ నాయకుడుగా ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి నవజ్యోత్ సింగ్ సిద్ధూ.సిద్దు ఎక్కడ వుంటే వివాదాలు అక్కడ ఉంటాయని అతని మీద చాలా విమర్శలు వున్నాయి.

 Sony Tv Remove Sidhu From Kapil Sharma Show-TeluguStop.com

ఇండియాకి చెందిన సిద్దు ఎప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా లౌకికవాద ముసుగులో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటాడు.అలాగే బద్ధ శత్రువు అయిన పాకిస్తాన్ తో ఎప్పుడు చెట్టాపట్టాల్ ఏసుకొని తిరుగుతూ, ప్రతి విషయంలో ఆ దేశాన్ని వెనకేసుకొస్తూ ఉంటాడు.

అలాగే పాకిస్తాన్ ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ గెలుపు తర్వాత అతని ప్రమాణ స్వీకారంలో భారత్ నుంచి కేవలం సిద్దు మాత్రమె పాల్గొన్నాడు.ఇండియా అంటేనే విషం కక్కే ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కి సిద్దు మంచి దోస్త్.

ఈ కారణంగానే పాకిస్తాన్ ని సమర్ధిస్తూ, ఇండియన్ ఆర్మీ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉంటాడు.కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ఎటాక్స్ జరిగిన, పాకిస్తాన్ ఆర్మీపై ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపిన ముందుగా సిద్దు తీవ్ర స్థాయిలో ఖండిస్తాడు.

ఇదిలా వుంటే తాజాగా సరిహద్దులో పుల్వామా జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి 45 మంది జవాన్ల ప్రాణాలు తీసేశారు.దీనిపై దేశ వ్యాప్తంగా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ప్రజలు నిరసన చేస్తూ వుంటే సిద్దు మాత్రం భారతీయులకి మండే విధంగా కామెంట్స్ చేసాడు.

ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఈ విషయంలో పాకిస్తాన్ ని నిందించకుండా, చర్చలు జరిపితే మంచిది అంటూ ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చాడు.ప్రతి దాడి వెనుక పాకిస్తాన్ ని అదే పనిగా నిందించడం కరెక్ట్ కాదు అన్నట్లు మాట్లాడాడు.

దీంతో సిద్దు కామెంట్స్ పై దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా నిరసన వ్యక్తం అయ్యింది.సోషల్ మీడియాలో బాయ్ కట్ సిద్దు, బాయ్ కట్ సోనీ టీవీ అంటూ హాష్ ట్యాగ్ తో నెటిజన్స్ ట్రోల్ చేస్తూ విమర్శలు చేసారు.

దీంతో ఆత్మరక్షణలో పడిన సోనీ టీవీ యాజమాన్యం కపిల్ శర్మ షో లో జడ్జ్ గా వున్న సిద్దుని ఉన్నపళంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.అయిన సిద్దు మాత్రం ఇప్పటి వరకు తన వాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయలేదు.

దీంతో అతని మీద మాత్రం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube