దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.దీంతో పలు పనులు ఉద్యోగాలు మరి ఇతర కారణాలు అంటూ పట్టణాలకు నగరాలకు వెళ్లి నటువంటి ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దీంతో టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ తదితర చిత్ర పరిశ్రమలో విలన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అటువంటి విలన్ సోనూ సూద్ లాక్ డౌన్ కారణంగా అక్రమాలకు వెళ్లలేకపోయిన ప్రజలకు తమ సొంత నివాసాలకి చేరుకునేందుకు గాను ఎంతగానో సహాయం చేశాడు.
ఈ క్రమంలో ప్రజలను తమ స్వగ్రామానికి తరలించేందుకు గాను సొంత ఖర్చులతో ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశాడు.
దీంతో ఎన్నో వందల మంది ప్రజలు తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేరుకున్నారు.కాగా ఓ యువకుడు తన స్వగ్రామానికి చేరుకునేందుకు సహాయపడినందుకు సోనూ సూద్ ఫోటోని దేవుడి విగ్రహం ముందు ఉంచి పూజలు చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేశాడు.
దీంతో తాజాగా సోనూసూద్ ఈ విషయం స్పందించారు.
తన ఫోటోలకి పూజలు, పునస్కారాలు చేయొద్దని తన అభిమానులను కోరాడు.అలాగే తన ఫోటోకి పూజలు చేస్తున్న యువకుడిని ఉద్దేశించి తన తల్లిని రోజు తన కోసం ఆ దేవుడిని ప్రార్థించమని కోరాడు.కాగా కరోనా వైరస్ ని అంతమొంచిందేకుగాను ఎంతగానో కృషి చేస్తున్నటువంటి వైద్యులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులకు హోటళ్లలో ఉచితంగా నివాసం ఏర్పాటు చేయడమే కాకుండా భోజన సదుపాయం కూడా కల్పించాడు.
దీంతో పలువురు నెటిజన్లు సోనూ సూద్ మంచి మనసున్న విలన్ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.