అమిత్‌ షాకు సోనియా గాంధీ సవాల్‌

దేశంలో తీసుకు వచ్చిన కొత్త పౌరసత్వ చట్టంపై విపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.

దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ఆందోళనలు చేస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టం ఉంది అంటూ తాజాగా ఒక సభలో సోనియా గాంధీ అన్నారు.ప్రస్తుతం అక్కడ ప్రజలు భయాందోళన నడుమ జీవిస్తున్నారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇంతగా చట్టంను జనాలు వ్యతిరేకిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ చట్టంను బలవంతంగా రుద్దుతుంది అంటూ ఈ సందర్బంగా ఆమె ప్రశ్నించింది.దేశంలో అనిశ్చితి వాతావరణం కల్పించడం, హింసకు తెర తీయడం మోడీ మరియు అమిత్‌ షాలకు కావాలని, వారు అదే చేస్తున్నారంటూ ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది.

ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్‌ షాలు ధైర్యం ఉంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలంటూ ఈ సందర్బంగా సోనియా గాంధీ సవాల్‌ విసిరింది.పరిస్థితి తీవ్రంగా ఉండటం వల్లే బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

ప్రస్తుతం దేశంలో ఉన్న అనిశ్చితిని తొలగించాలంటే వెంటనే పౌరసత్వ కొత్త చట్టంను రద్దు చేయాలంటూ ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చింది.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు