రాజస్థాన్ సంక్షోభంపై సోనియా ఫోకస్

రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ పై కాంగ్రెస్ అధిష్టానం వేచిచూసే ధోరణా అవలంబించేలా కనిపిస్తోంది.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం గెహ్లోత్ పేరు ప్రధానంగా తెరపైకి రావడం.

 Sonia Focus On Rajasthan Crisis ,sonia Focus,rajasthan Crisis ,ashok Gehlot ,con-TeluguStop.com

అప్పుడు ఆ‍యన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సివస్తే సచిన్ పైలట్ ను ఆ స్థానంలో నియమిస్తారనే అంచనాల నేపథ్యంలో గెహ్లోత్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాన్ని సంధించారు.

అయితే ఈ పరిణామాల వెనుక గెహ్లోత్ ప్రమేయం ఏమీ లేదని కాంగ్రెస్ పరీశీలకులు తేల్చేసి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు.

అదేసమయంలో గెహ్లోత్ వర్గీయలైన ఇద్దరు మంత్రులు శాంతి ధావల్, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, చీఫ్ విప్ కలిసి నడిపారని.వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సూచించారు.ఈ మేరకు ఆ రాష్టా చీఫ్ విప్ తో పాటు ఆ ఇద్దరు మంత్రులకు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది.తిరుగుబాదారులపై చర్య తీసుకోవాలని, పార్టీలో క్రమశిక్ష‎ణా రాహిత్యాన్ని అరికట్టాలని పరిశీలకుల సూచన మీదటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ‎ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

ఫలితంగా కాంగ్రెస్ జాతీయ అ‎ధ్యక్షుడి ఎన్నిక వరకూ గెహ్లోత్ నే సీఎం పదవిలో కొనసాగింవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

Telugu Ashok Gehlot, Whip, Congress, Kamal Nath, Pratapsingh, Rajasthan, Pilot,

అంతకుముందు.రాజస్థాన్ సంక్షోభం పై సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు.పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ ను మధ్యప్రశ్ నుంచి రప్పించి ఆయనతో కీలక చర్చలు జరిపారు.

ఆ తర్వాత పార్టీ పరిశీలకులు మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్ ఇచ్చిన నివేదికను ఆమె అధ్యయనం చేశారు.అనంతరం తిరుగుబాటురులపై చర్యల గురించి పరిశీలించేందుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీని ఢిల్లీ రమ్మని కోరారు.

ఆంటోనీ ఢిల్లీ చేరుకున్నారు.అయితే పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లోత్ పోటీచేసే అవకాశాలు లేవని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు.

లయితే పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లోత్ పోటిచేసే అవకాశాలు లేవని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.మరోవైపు పార్టీ నాయకత్వం చర్చలకు పిలిస్తే కలుసుకునేందుకు వీలుగా సచిన్ పైలట్ ఢీల్లీ చేరుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube