అర్జున ఫల్గుణ’ నుంచి ఒక తీయని మాటతో సాంగ్ లిరికల్ వీడియో విడుదల

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.

 Song Lyrical Video Release With A Thiyyani Mataho From Arjuna Falguna ' , Arjun-TeluguStop.com

ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.తాజాగా చిత్రంలోని ఒక తీయని మాటతో సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది.

ఓక తీయని మాటతో సాంగ్‌ హీరో శ్రీవిష్ణు హీరోయిన్ అమృత అయ్యర్‌తో రిలేషన్‌లోని ఆనందాన్ని వ్యక్తం చేసే రొమాంటిక్ మెలోడీ.ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు.

శశ్వత్ సింగ్, శ్రేయా అయ్యర్ ఈ పాటను పాడారు.విజువల్‌గా.

ఈ పాట చక్కగా, లవ్లీగా కనిపిస్తుంది.

ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

గతంలో విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు.పి.సుధీర్ వర్మ మాటలు అందించారు.పి.జగదీష్ చీకటి.సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి (రాజా వారు రాణి గారు ఫేమ్), చైతన్య (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక బృందం

నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సహ నిర్మాత : ఎన్ ఎమ్ పాషా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని డైలాగ్స్ : సుధీర్ వర్మ.పి సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్.యాక్షన్ : రామ్ సుంకర మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ లిరిక్స్ : చైతన్య ప్రసాద్.పబ్లిసిటీ డిజైన్ : అనిల్&భాను పీఆర్వో : వంశీ-శేఖర్.కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రసన్న వర్మ దంతులూరి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube