ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టిఆర్ఎస్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కరీంనగర్ లో బిజెపి కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై బండి సంజయ్ చేపట్టిన “జాగరణ దీక్ష” ఈ సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే.
ఈ సమయంలో బిజెపి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.అనంతరం పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం జరిగింది.
అయితే ఈ రోజు బండి సంజయ్ కరీంనగర్ ఎక్సైజ్ కోర్ట్ కి హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది.దీంతో తాజా పరిస్థితులపై ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు సీరియస్ అయ్యారు.
ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు మద్దతుగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని ధ్వజమెత్తారు.అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం దారుణమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోము వీర్రాజు పేర్కొన్నారు.