కోర్టులకే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటన్న సోమిరెడ్డి

నెల్లూరు : వివాదంగా మారిన కోర్టులో చోరీ ఘటన చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని నిరసన తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి, టీడీపీ నేతలు అత్యంత విలువైన పత్రాలను కోర్టు నుంచి ఎలా చోరీ చేస్తారన్న సోమిరెడ్డి కోర్టులకే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటన్న సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్.జాతీయ స్థాయిలో మొదటి సారి ముద్దాయిలే కోర్టులోని ఆధారాలు, పత్రాలు చోరీ చేశారు.

2016లో నేను నా కుటుంబ సభ్యుల పై వచ్చిన ఆరోపణల పై ఫిర్యాదు చేసాను.పోలీసుల విచారణలో నా పై ఆరోపణలు ఫ్రాడ్ అని తేల్చారు.

ఆరోపణలు చేసిన మంత్రి కాకనితో పాటు మరి కొందరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు.మరో ఒక నెలలో కేసు హీయరింగ్ కి వస్తున్న సమయంలో ఇలా చేశారు.

నాపై ఆరోపణల కేసులో శిక్ష పడుతుంది అన్న అనుమానం తో నే ఇలా చేశారు.ఈ కేసుని మేము వదిలే ప్రసక్తే లేదు.

Advertisement

అవసరమైతే కోర్టులున్నాయి.కోర్టులో అత్యంత పటిష్ట భద్రత నడుమున్న ఆధారాలను అపహరించారు.

హైకోర్టు చొరవ తీసుకొని బెయిల్ రద్దు చేయాలి.కోర్టులకు రక్షణ లేకపోతే ఇక సాక్షుల పరిస్థితి కష్టమే.

కోర్టులకు రక్షణ కల్పించలేని పోలీసులు ప్రజలకేమి రక్షణ కల్పిస్తారు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు