వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంటూ కష్టాల్లో, నష్టాల్లో ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన వారిలో చాలామందికి టికెట్ల విషయం దగ్గరకు వచ్చేసరికి అన్యాయం జరిగింది.దీంతో వారు అసంతృప్తికి గురయితే ఆ ప్రభావం ఎన్నికల్లో పడుతుంది అనే ఆలోచనతో జగన్ వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ప్రకటించారు.
అయితే పార్టీ అధికారంలోమి వచ్చేసింది.అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్న వారికి ఇప్పుడు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానం మొదలయ్యింది.
ప్రస్తుతం జగన్ కొంతమంది ఎమ్మెల్యేలకే నామినేటెడ్ పదవులు ఇస్తుండడంతో వీరందరిలో ఆగ్రహం పెరిగిపోతోంది.

ఎమ్మెల్యే పదవులు ఉన్నా మళ్లీ వారికే నామినేటెడ్ పోస్టులు ఇస్తే మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి అంటూ వీరంతా ఇప్పుడు జగన్ కు చేరేలా తమ నిరసన గళం వినిపిస్తున్నారు.ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తుడా చైర్మన్‌గా , జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా సీఎం జగన్ నియమించారు.
ఇదే కోవలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాకాని గోవర్దన రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారికి నామినేటెడ్ పదవులు దక్కబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
మంత్రి పదవులు దక్కని వారందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ కొంతమంది ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు.
జగన్ చేపట్టిన పాదయాత్ర సమయంలో జగన్ చాలా మంది పార్టీ నాయకులకు ప్రభుత్వం ఏర్పాటయితే సీట్లు దక్కనివారికి నామినేటెడ్ పదవులు ఇస్తానని ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని హామీలిచ్చారు.
ఆ మేరకు జగన్ పోస్టుల నియామకాలను కూడా ఇప్పటికే మొదలుపెట్టారు.పార్టీ కీలక నాయకులు తలశిల రఘురాం, వైవీ సుబ్బారెడ్డిలకు ముఖ్య పదవులు కట్టబెట్టారు.
అసలు మంత్రిపదవి దక్కుతుంది అని ఎవరూ ఊహించనివారికి జగన్ పదవులు కట్టబెట్టారు.దీంతో నామినేటెడ్ పదవుల విషయంలో కొందరు నాయకుల్లో టెన్షన్ నెలకొంది.
ముఖ్యంగా పదవులున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో జగన్ సాలు తమకు న్యాయం చేస్తాడా అనే అనుమానం కూడా వీరిలో మొదలయ్యింది.