జగపతి బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

సినిమా ఇండస్ట్రీ లో హీరోలు గా ఉన్న చాలా మంది నటులు వాళ్ళు చేసిన చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్లు పోషిస్తూ చాలా బిజీగా గడుపుతూ ఉంటారు.

అయితే సినిమా ఇండస్ట్రీ లో ఒకమంచి నటుడిగా తన స్టామినా ఏంటో నిరూపించుకున్న హీరో జగపతి బాబు( Jagapathi Babu ).

ఈయన సినిమాల్లోకి రాక ముందు ఒక బిజినెస్ చేస్తూఉండేవాడు తనకి మాత్రం సినిమాలో హీరో కావాలని ఉండేది కానీ జగపతి బాబు వాళ్ళ అమ్మకి జగపతి బాబు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు అందుకే ఆమె జగపతి బాబు ని బిజినెస్ చూసుకోమని చెప్పి అతన్ని బిజినెస్ లోనే ఉంచేది.

ఇక ఈ బిజినెస్ తో అలిసిపోయిన జగపతిబాబు వాళ్ళ నాన్న తో నేను సినిమాలు చేస్తా అని చెప్పగానే ఆయన జగపతి బాబు నిర్ణయాన్ని ఒప్పుకొని మద్రాస్ లో ఉన్న మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు లో జైన్ చేసాడు.కానీ ఆయన ఇక యాక్టింగ్ కోర్సు ముగిసిన వెంటనే ఆయన ఇండస్ట్రీ లో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు వాళ్ళ నాన్న అయినా రాజేంద్రప్రసాద్ గారు జగపహతి బాబు ఎంట్రీ కి రంగం సిద్ధం చేసారు కానీ మొదట ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి.

ఇక జగపతి బాబు హీరో గా పనికి రాడు అని అనుకున్న టైం లో నాగార్జున తో శివ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మగాయం సినిమా( Gaayam )ని కూడా నాగార్జున తో తీద్దాం అనుకోని కథ తీసుకొని నాగార్జున దగ్గరికి వెళ్తే నాగార్జున( Nagarjuna ) అప్పుడు వేరే సినిమాల్లో బిజీ గా ఉండి ఈ సినిమాని వదులుకున్నారు ఇక ఈ స్టోరీ ని జగపతి బాబు తో చేయమని ఆయన అయితేనే ఈ క్యరెక్టర్ కి బాగా సెట్ అవుతాడు నాగార్జున నే జగపతి బాబు ని రిఫర్ చేసాడట.ఇక దాంతో వర్మ జగపతి బాబు ని పెట్టి తీసిన గాయం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.దాంతో ఆయనకి ఇండస్ట్రీ లో విపరీతమైన సినిమా అవకాశాలు వచ్చాయనే చెప్పాలి.

Advertisement

ఇక అక్కడి నుండి జగపతి బాబు అంటే ఏంటి అనేది అందరికి అర్థం అయింది.ప్రస్తుతం ఆయన విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు