సూపర్ స్టార్ కృష్ణ మృతి ప్రతి ఒక్కరిని కలచి వేసింది.ఇండస్ట్రీ లో ఎన్నో ప్రయోగాలు చేసి ఒక గొప్ప సినీ శాస్త్రవేత్తగా నిలిచిన కృష్ణ మృతికి ప్రముఖులు నివాళ్లు అర్పిస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ ఆరంభంలో నాలుగు స్థంభాలుగా నిలిచిన ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణంరాజు మరియు కృష్ణ లు నలుగురు మృతి చెందడం తో తెలుగు సినిమా ఒక జనరేషన్ ను పూర్తిగా కోల్పోయినట్లు అయ్యింది.ఈ నేపథ్యం లో సోషల్ మీడియాలో కొందరు ఆసక్తికర పోస్ట్ లు పెడుతున్నారు.
కృష్ణ స్వర్గంకు వెళ్లి తన సినీ మిత్రులు అయిన ఎన్టీఆర్.ఏయన్నార్.కృష్ణం రాజులను కలవడం జరిగింది.ఆ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరంగా చర్చ కూడా జరిగిందని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ను కృష్ణ కలిసిన సందర్భంగా మాట్లాడుతూ.నీ మనవడు ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటించి హాలీవుడ్ వాళ్లకు కూడా షాక్ ఇచ్చాడు.
ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యే విధంగా నటించి మెప్పించాడు.నీ పేరు పెట్టుకున్నందుకు నిన్ను మించిన గొప్ప నటుడు అయ్యాడు అన్నాడట.
ఇక ఏయన్నార్ ను కృష్ణ స్వర్గం లో కలిసి నీ మనవడు ఏజెంట్ గా రాబోతున్నాడు.త్వరలోనే ఏజెంట్ గా నీ మనవడు దుమ్ము లేపబోతున్నాడు.
కచ్చితంగా ఏజెంట్ సినిమా గొప్ప విషయాన్ని సొంతం చేసుకుంటుంది అంటున్నారని ఏయన్నార్ తో కృష్ణ అన్నాడని మీమ్స్ లో పేర్కొన్నారు.

ఇక కృష్ణంరాజు వద్దకు వెళ్లిన కృష్ణ నీవు వచ్చిన తర్వాత ఆదిపురుష్ టీజర్ వచ్చింది.అలాంటి ఒక టీజర్ ను నువ్వు చూసి ఉండాల్సింది.ఒక అద్భుతమైన పాత్రలో నీ వారసుడు ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
బాహుబలిని మించే విధంగా ఆదిపురుష్ ఉంటుందని అంతా అంటున్నారు.ప్రభాస్ కేవలం పాన్ ఇండియా స్టార్ కాదు.
పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగిన తీరును ను త్వరలోనే ఇండియన్ ప్రేక్షకులు చూడబోతున్నట్లుగా కృష్ణ తెలియజేశాడట.మొత్తానికి ఎన్టీఆర్.
ఏయన్నార్.కృష్ణంరాజు లతో సంభాషణ అన్నట్లుగా వైరల్ అవుతున్నాయి.