చిరు పొలిటికల్ ఎంట్రీ పై నాదెండ్ల రాజకీయం ?

నిన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన ప్రస్తావన రాజకీయం సంచలనంగా మారడంతో పాటు ఇటు జనసేన కార్యకర్తల్లోనూ సంతోషాన్ని, అనేక సందేహాలను కలిగించాయి.

అసలు నాదెండ్ల మనోహర్ చెప్పినట్టుగా చిరంజీవి జనసేన వెనకాల మద్దతుగా నిలబడతారా లేక ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలతో పాటు, తిరుపతి ఉప ఎన్నికలలో లబ్ధి చేకూరే విధంగా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడా అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నారు.ఆయన ఈ వ్యాఖ్యలు ఆషామాషీగా అయితే చేసి ఉండరు అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.

నిన్న నాదెండ్ల చేసిన ఈ వ్యాఖ్యలపై  ఇప్పుడు రకరకాల విశ్లేషణలు  మొదలయ్యాయి.అసలు చిరు ఎంట్రీ పైన నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది చిరంజీవే.

కొన్నాళ్ల పాటు సినిమాలు చేయాలని పవన్ కు చిరంజీవి సూచించారు.ఆయన సూచనల వల్లే మళ్లీ పవన్ సినిమాలు చేస్తున్నారు.2,3 ఏళ్ల తర్వాత అంటే , వచ్చే ఎన్నికల నాటి కి పవన్ రాజకీయ ప్రస్థానం లో చిరంజీవి కూడా ఉంటానన్నారు.పవన్ చిరు ఏకాంత భేటీ లో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు నేదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే ఇక్కడే అనేక అనుమానాలు అందరిలోనూ మొదలవుతున్నాయి.నాదెండ్ల చెప్పినట్లుగా చిరు రాజకీయంగా పవన్ వెనుక నిలబడాలి అనుకుంటే ఎప్పుడో ఆ పని చేసి ఉండేవారు.2014 లో జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ప్రోత్సహించేవారు.అలాగే 2019 ఎన్నికల్లో జనసేన కు మద్దతుగా ఇస్తున్నాను అని చిరంజీవి బహిరంగ ప్రకటన చేయడంతో పాటు, ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉండేవారు.

కానీ అవి ఏవీ చిరు చేయలేదు.అసలు తనకు రాజకీయాలు సంబంధం లేదు అన్నట్టుగానే ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు.గతంలో ప్రజారాజ్యం స్థాపించిన తర్వాత ఎదురైన అనుభవాలు ఇవన్నీ చిరు కు బాగా గుర్తుండిపోయాయి.

ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నా, ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టేశారు. సినిమాలపై దృష్టి పెట్టి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఆయన వ్యవహరిస్తున్నారు.

అటు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ, ఏపీ సీఎం జగన్ తోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు.తరచుగా వారిని కలుస్తూ, వారి పరిపాలన తీరును ప్రశంసిస్తూ వస్తున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

కానీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఆకస్మాత్తుగా చిరు  ప్రస్తావన తీసుకురావడం వెనుక త్వరలో జరగబోయే పంచాయతీ , తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలే కారణం అనే విషయం బయటకు వస్తోంది.నాదెండ్ల వ్యాఖ్యలు అనేక అనుమానాలు రేకెత్తించే విధంగా ఉండడంతో పాటు,  తాత్కాలికంగా జనసేన కు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు