40 మంది ఫ్రెండ్స్ తో బన్నీ 40వ పుట్టిన రోజు వేడుకలను ప్లాన్ చేసిన స్నేహరెడ్డి.. ఫోటో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే.ఈమెకు ఇండస్ట్రీ తో సంబంధం లేకపోయినప్పటికీ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉంది.

ఇక అల్లుఅర్జున్ సినిమాలతో బిజీకాగా, స్నేహ రెడ్డి తన కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు.ఇకపోతే ఏప్రిల్ 8 వ తేదీ బన్నీ తన 40వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ పుట్టిన రోజున బన్నీ తన స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో జరుపుకున్నట్లు మనకు తెలిసిందే.తాజాగా బన్నీ తన 40వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ ఫోటోనుహీరో నవదీప్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటి అనే విషయం గురించి తెలియజేశారు.

అల్లు అర్జున్ 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తన భార్య స్నేహ రెడ్డి అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి 40 మందిని పార్టీకి ఆహ్వానించి అల్లు అర్జున్ కి సర్ప్రైస్ ఇచ్చారు.ఇలా అతి తక్కువ సమయంలోనే అందరికీ గుర్తుండిపోయే విధంగా స్నేహ అదిరిపోయే ప్లాన్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే నవదీప్ మరోసారి హ్యాపీ బర్తడే అంటూ ఈ ఫోటోని షేర్ షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు