షిప్ సైజులో స్కై క్రూయిజ్.. ఈ ఫ్యూచరిస్టిక్ విమానం గురించి తెలిస్తే..

స్కై క్రూయిజ్( Sky Cruise ) ఎప్పటికీ దిగని ఒక పెద్ద ఫ్లయింగ్ హోటల్.ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ ద్వారా శక్తిని పొందుతుంది, న్యూక్లియర్ ఫ్యూజన్ ఇంకా ఉనికిలో లేదు.

 Sky Cruise In Ship Size.. If You Know About This Futuristic Plane, Sky Cruise,-TeluguStop.com

ఇది భూమిని తాకకుండా సంవత్సరాలపాటు ఎగరగలదు.స్కై క్రూయిజ్ ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉంది, అయితే ఇది ఇప్పటికే చాలా ఎగ్జైట్‌మెంట్ సృష్టించింది.

ఇది విజయవంతమైతే, అది మనం ప్రయాణించే మార్గంలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది.

హోటల్‌లో కమర్షియల్ ఫ్లైట్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఉంటాయి, అలానే దీనిలో హై-ఎండ్ హోటల్‌లో ఉండే అన్ని విలాసాలను ఉంటాయి.ఇందులో రెస్టారెంట్లు, షాప్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, క్యాసినో కూడా ఉంటాయి.స్కై క్రూయిజ్ ఒకేసారి 5,000 మందిని తీసుకువెళుతుంది.

ఈ స్కై క్రూయిజ్ ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయింది.ఈ ఫ్లైట్ AI ద్వారా ఎగురుతుంది.

ల్యాండింగ్ లేకుండా నెలల తరబడి గాలిలో ఉంటుంది.ఈ వీడియో “ఎక్స్” అనే ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయగా దాన్ని చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు.

స్కై క్రూయిజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్ కోసం పెద్ద డెక్ ఉంటుంది.వెనుక భాగంలో “పారానార్మల్ హాల్( Paranormal Hall )అని పిలిచే స్పెషల్ రూమ్ ఉంటుంది.ఈ గది చుట్టూ కిటికీలు ఉంటాయి కాబట్టి ప్రతి కోణం నుంచి ఆకాశాన్ని చూడవచ్చు.20 ఎలక్ట్రిక్ ఇంజన్లతో ఇది నడుస్తుందని కూడా వైరల్ వీడియోలో చూపించారు.ఈ వీడియోపై చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా.కొందరు ఇది టైటానిక్‌గా ఓ ట్రాజెడీ అవుతుందేమో అని కామెంట్స్ చేశారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube