స్కంద మూవీ బుకింగ్స్ అలా ఉన్నాయా.. ఆ జిల్లాలలో బుకింగ్స్ ఇంత దారుణమా?

రామ్ బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబో మూవీ స్కందపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

అయితే స్కంద మూవీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అయినా ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

రాయలసీమ జిల్లాలలో ఈ సినిమా బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి.

హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లుగా పేరు సంపాదించుకున్న ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్ లో సైతం ఇప్పటికీ టికెట్లు అందుబాటులో ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. స్కంద సినిమా( Skanda movie )కు ఆశించిన రేంజ్ లో ప్రమోషన్స్ చేయకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతోంది.బోయపాటి శ్రీను తన సెంటిమెంట్ వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

స్కంద మూవీ కమర్షియల్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.ట్రైలర్ లో కొత్తదనం లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతోంది.

ఈ సినిమా రిజల్ట్ శ్రీలీల ( Sreeleela )కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపకపోయినా రామ్, బోయపాటి శ్రీను కెరీర్ పై ప్రభావం చూపనుంది.ఈ ఇద్దరూ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో రామ్ బోయపాటి ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

రామ్, బోయపాటి శ్రీను( Ram Boyapati Srinu ) ఈ సినిమాలకు చెరో 20 కోట్ల రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.రామ్, బోయపాటి శ్రీను స్కంద సినిమా కోసం కష్టపడ్డారు.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు