యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ చిన్న కూతురుకి వస్తున్న అవకాశాలు చూస్తూ ఉంటే అదృష్టం అరచేతిలో ఉందనిపిస్తుంది.పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా ముందు ఎంట్రీ ఇచ్చిన ఆమె నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకి రాలేదు.
మొదటి సినిమా సగం షూటింగ్ లోనే ఆగిపోయింది.ఇక రెండో సినిమా అయినా రిలీజ్ అవుతుందా అంటే అది కూడా ఆపసోపాలు పడుతుంది.
ఒక వేళ థియేటర్ లో రిలీజ్ అయిన ప్రేక్షకులు ఆదరిస్తారనే గ్యారెంటీ కూడా లేదు.అయితే రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
ప్రస్తుతం కృష్ణవంశీ రంగ మార్తాండ మూవీలో శివాత్మిక నటిస్తుంది.అలాగే మరో రెండు సినిమాలు తెలుగులో రెడీగా ఉన్నా ఉన్నాయి.

అలాగే కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి గౌతమ్ కార్తీక్ కి జోడీగా ఆనంద విలయాడుమ్ వీడు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ పూర్తి చేసింది.ఇదిలా ఉంటే మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇప్పుడు రెండో అవకాశం ఈ బ్యూటీ సొంతం సొంతం చేసుకుంది.అశోక్ సెల్వన్ హీరోగా ఆర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో శివాత్మిక ఒక హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.ఇందులో ఆమెతో పాటు రితూవర్మ, అపర్ణ బాలమురళీ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో శివాత్మిక నటించబోతున్నట్లు తెలుస్తుంది.ఇక సినిమాలో తన పాత్ర గురించి శివాత్మిక క్లారిటీ ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేసింది.
నా కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రంలో భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది.రోడ్ జర్నీ నేపధ్యంలో ఈ మూవీ కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది.