డైరక్టర్ కి బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చిన సీతారామ్ టీం..!

టాలెంటెడ్ డైరక్టర్ హను రాఘవపుడి డైరక్షన్ లో మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా సీతారాం.

సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

కన్నడ భామ రష్మిక మందన్న కూడా సినిమాలో మరో కథానాయికగా నటిస్తుంది.ఈమధ్యనే టైటిల్ ఎనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది.

ఈ సినిమా కోసం డైరక్టర్ ఎంత కష్టపడ్డాడు అన్నది హను రాఘవపుడి బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.మైనస్ డిగ్రీల లొకేషన్స్ లో కూడా చిత్రయూనిట్ చాలా కష్టపడి షూటింగ్ చేసిందని తెలుస్తుంది.

డైరక్టర్ డెడికేషన్ ఏంటన్నది చూపిస్తూ హను రాఘవపుడి కి సర్ ప్రైజ్ ఇస్తూ స్పెషల్ వీడియో వదిలారు.ప్రతిభ ఉన్నా ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోని డైరక్టర్ హను రాఘవపుడి సీతారాం తో అయినా సక్సెస్ కొడతాడేమో చూడాలి.

Advertisement

ఈ సినిమాను వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ గా తెలుగులో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు