తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ముద్దుల కూతురు గారాల పట్టి సితార( Sitara Ghattamaneni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ఈ చిట్టి పాపకే సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.తల్లిదండ్రులు సెలబ్రిటీలు కావడంతో సితారకీ చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల్లో భారీగా అభిమానులు ఉన్నారు.
ఇకపోతే సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
తరచూ సోషల్ మీడియాలో తనకు సంబందించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.కాగా సితార షేర్ చేసే ఫోటోలు వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి.కాగా ఇటీవల కాలంలో వరుసగా డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది సితార.
డాన్స్ పెర్ఫార్మెన్స్ లను ఇరగదీస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె పీఎంజే జువెలరీ బ్రాండ్‌కి( PMJ Jewelry ) అంబాసిడర్‌గా వ్యవహస్తోంది.
సితార చేస్తున్న తొలి యాడ్ ఇది.ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేశారని తెలుస్తోంది.సంబంధిత ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్‌ను సితార కలెక్షన్స్ పేరుతో న్యూయార్క్ సిటీలోని ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు.
ఈ విషయాన్ని మహేశ్ సోషల్ మీడియా టీమ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.లిటిల్ ప్రిన్సెస్ యాడ్‌ను టైమ్ స్వ్కేర్‌పై( Times Square ) చూసి మహేశ్ అభిమానులు ఆనందిస్తున్నారు.చిన్నవయసులో సితారకు దక్కిన గౌరవమిదన అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
నేడు అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా తమ అభిమాన హీరో గారాల బిడ్డను టైమ్స్వ్కేర్లో చూడడం గర్వంగా ఉందని అభిమానులు సందడి చేస్తున్నారు.అంతే కాదు అతి చిన్న వయసులో కమర్షియల్ యాడ్ స్టార్ కిడ్స్‌గా సితార గుర్తింపు పొందింది.