పొలంలో ఎరువులు వేసేందుకు సరికొత్త పరికరం.. ఈ రైతు ఐడియా భేష్..!

వ్యవసాయ రంగంలో ఎన్నో అధునాతన మార్పులు అందుబాటులోకి వచ్చాయి.అయితే వ్యవసాయంలో కొన్ని మెలకువలు పాటిస్తే శ్రమతో పాటు పెట్టుబడి తగ్గుతుంది.

 A New Device For Applying Fertilizers In The Farm This Farmer's Idea Is Awesome-TeluguStop.com

అధిక దిగుబడి పొంది మంచి లాభాలు పొందవచ్చు.ప్రస్తుతం వ్యవసాయ రంగంలో( agriculture ) కూలీల కొరత పెరుగుతూ ఉండడంతో వ్యవసాయ పెట్టుబడి అనేది విపరీతంగా పెరిగిపోయింది.

దీంతో సంవత్సరం అంతా కష్టపడిన రైతుకు చివరికి ఆదాయం శూన్యం.

ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఒక రైతు పొలంలో ఎరువులు చల్లడానికి తక్కువ ఖర్చుతో ఒక కొత్త పరికరాన్ని రూపొందించాడు.

ఈ పరికరంతో తగిన మోతాదులో పంట మొక్కలకు ( crop plants )ఎరువులు అందించవచ్చు.ఈ పరికరం వల్ల కాస్త కూలీల ఖర్చు తగ్గడంతో పాటు ఎరువులు కూడా వృధా అవ్వకుండా ఉంటుంది.

ఒక నాగలికి వాటర్ బబుల్ ను తలక్రిందులుగా పెట్టి ఆరు ఇనుప రాడ్లని వెల్డింగ్ చేశాడు. వాటర్ బబుల్( Water bubble ) కింద భాగంలో పెద్ద రంధ్రం చేశాడు.

వాటర్ బబుల్ పై భాగంలో గేట్ వాల్వ్ ఏర్పాటు చేశాడు.ఈ గేట్ వాల్వ్ తో ఎరువులను కావలసిన మోతాదులో పొలంలో వేసుకోవచ్చు.

ఈ వాటర్ బబుల్ కు కింది భాగంలో పైపు గొట్టాలు అమర్చబడి ఉన్నాయి.ఈ పరికరం సహాయంతో ఎరువు వేస్తే, అది మొక్కల వేర్ల దగ్గర పడుతుంది.

Telugu Agriculture, Fertilizers, Latest Telugu, Seedcum, Bubble-Latest News - Te

ఈ పరికరాన్ని నడిపించడానికి కేవలం ఒక వ్యక్తి ఉంటే చాలు.ఈ పరికరం ఒకవైపు నాగలి దున్నుతూ, మరోవైపు ఎరువులు మొక్కలకు అందిస్తుంది.ఈ పరికరం తయారు చేయడానికి కేవలం 500 రూపాయలు ఖర్చు అవుతుంది.ఎరువులు వేయడానికి మార్కెట్లో సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్స్ ( Seed cum fertilizer drills )చాలానే ఉన్నాయి కానీ వాటి ఖరీదు చాలా ఎక్కువ.

రైతులు కాస్త ఆలోచించి ఇలాంటి సరికొత్త పరికరాలను తయారు చేసుకుంటే వ్యవసాయంలో దాదాపుగా శ్రమతో పాటు పెట్టుబడులను తగ్గించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube