మేడం స్మిత 'నిజం'ను పట్టించుకునే వారే లేరు పాపం..!

Singer Smita Talk Show Nijam Public Response , Nijam , Singer Smita , Talk Show , SonyLIV , Chiranjeevi, Chandra Babu Naidu , Rana

ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ టాక్ షో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.బాలయ్య ఎంతో మంది గెస్ట్‌ ల యొక్క మనో భావాలను.

 Singer Smita Talk Show Nijam Public Response , Nijam , Singer Smita , Talk Show-TeluguStop.com

వారి యొక్క వ్యక్తిగత మరియు వృత్తి పరమైన విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అలరించాడు.అన్‌ స్టాపబుల్ టాక్ షో రెండు సీజన్‌ లు పూర్తి అయిన విషయం తెల్సిందే.

అన్‌ స్టాపబుల్‌ తర్వాత సోనీ లివ్ లో స్మిత హోస్ట్( Smita ) గా ఒక టాక్ షో స్ట్రీమింగ్ అవుతోంది.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) చంద్రబాబు నాయుడు ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వృత్తి పరమైన విషయాలతో పాటు వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను అడిగి ప్రేక్షకులకు తెలియజేస్తుంది.ఆకట్టుకునే విధంగా ఉన్న ఆ కార్యక్రమాన్ని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించడం లేదు.సోనీ లివ్ తెలుగు లో( SonyLIV ) ఎక్కువ ప్రేక్షకులను కలిగి లేదు.కనుక ఎక్కువ మంది ఆ కార్యక్రమాన్ని చూడడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అతి త్వరలోనే ఆ కార్యక్రమం మొదటి సీజన్ పూర్తవుతుంది.పెద్ద గా సక్సెస్ కాలేదు కనుక రెండవ సీజన్ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సింగర్ స్మిత ఎంతో కష్టపడి చేస్తున్న షో.సోనీ లివ్ వారు కాస్త ఎక్కువగా ఖర్చు చేసి రూపొందించిన ఈ షో ను జనాలు చూడక పోవడం పట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హోస్ట్‌ ఒక స్టార్‌ హీరో లేదా హీరోయిన్ అయి ఉంటే ఫలితం మరో లా ఉండేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సింగర్ స్మిత తనవంతు టాక్ షో ను అద్భుతంగా నడిపించే ప్రయత్నం చేస్తుంది కానీ ఆడియన్స్ ను మాత్రం రాబట్టుకోలేక పోయింది.

Video : Singer Smita Talk Show Nijam Public Response #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube