సింగర్ మాలతి( Singer Malathi ).ఈమె తెలుగులో పాటలు తక్కువగానే పాడిన ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం పాట ఎంతగానో ఫేమస్ అయ్యింది.
తెలుగులో తో పాటు తమిళ్ లో ఎక్కువగా పాటలు పాడిన మాలతి తన సినిమా జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంది అంటూ చెబుతున్నారు.అలాగే తన వ్యక్తిగత జీవితంలో అనేక విషయాలను ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు.
చాలా చిన్న వయసులో ఒంటిపైన ఉన్న ఒకే డ్రెస్సుతో ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందని పెళ్లి చేసుకోవడం కోసం కేవలం ఒకే ఒక డ్రెస్ తో బయటకు వెళ్ళిపోయాను అంటూ తెలిపారు మాలతి.

1991లో కేవలం రాత్రి 8 గంటల సమయంలో భర్త తన మెడలో పసుకుతాడు కట్టాడని మా పెళ్లికి సాక్షులు కూడా లేరు అంటూ తెలిపారు.ఇలాంటి పెళ్లి చేసుకోవడం వల్ల రెండు కుటుంబాల నుంచి అనుమతి దొరకలేదని వారికి ముందు ఎక్కడ తాము జీవితంలో ఫెయిల్ అవ్వకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో కష్టపడి తమ జీవితాన్ని మలుచుకున్నామంటూ చెప్పారు.ఒంటిపైన ఒక డ్రెస్సు ఉంటే దండంపైన మరో డ్రస్సు ఉండే అలాంటి పరిస్థితులలో తమ జీవితం ఎంతో సంతోషకరంగానే గడిచింది అంటూ చెప్పారు.
తన కూతురు చిన్న వయసులోనే పుట్టిందని ఆమె పుట్టే సమయానికి మేము కాస్త ఆర్థికంగా నిలదొక్కుకున్నామని, పూట గడవడానికి కష్టపడ్డ రోజుల నుంచి మధ్యతరగతి జీవితానికి వచ్చేసాం అంటూ తెలిపారు.

తన భర్త లక్ష్మణ్( Lakshman ) తనకు ఇచ్చే గౌరవం వల్లే ఆయనపై ప్రేమ పుట్టిందని, అందుకే ఇంట్లో అందరూ వద్దు అన్నా కూడా ఆయనపై ఇష్టంతో పెళ్లి చేసుకున్నానని, కానీ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా తన పెళ్లి విషయంలో అసంతృప్తి చెందలేదు అంటూ తెలుపుతున్నారు.ప్రస్తుతం తన వయసు 50 ఏళ్లు అని ఇప్పటికే తన కూతురు పెళ్లి కూడా చేసి సంపూర్ణమైన జీవితాన్ని చూసేశానని నాటి నుంచి నేటి వరకు తమ జీవితం ఎంతో హాయిగా గడిచింది అంటూ తెలుపుతున్నారు.తన కూతురు పుట్టాక రెండు కుటుంబాలు కూడా కలిసాయని ప్రస్తుతం అందరం సంతోషంగానే ఉన్నామంటున్నారు.
ఇక మొట్టమొదటిగా మాలతీ అందుకున్న పారితోషకం 50 రూపాయలు అని దంగల్ సినిమా అమీర్ ఖాన్ కి తెలుగు మరియు తమిళ్లో డబ్బింగ్ పాటలకు గాని తన జీవితంలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నాను అంటూ మాలతి తెలిపారు.








