నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావ్.. సింగర్ చిత్ర ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ సింగర్ చిత్ర( Singer Chitra ) సుపరిచితమే.తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను పాడే సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Singer Chitra Emotional Post Daughter Nandana Death Anniversary Details, Singer-TeluguStop.com

అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాంకర్లలో చిత్ర కూడా ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇప్పటికీ ఈమె పాటలను పాడుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోను పాటలు పాడారు.నాలుగు దశాబ్దాల సినీ సంగీత ప్రయాణంలో దాదాపు 25 వేలకు పైగా పాటలు ఆలపించారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇళయరాజా వంటి సంగీత దిగ్గజాలతో ఆమె పనిచేశారు.కాగా సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్ర విజయ్ శంకర్( Vijay Shankar ) అనే ఒక ఇంజినీర్‏ను పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత 18 డిసెంబర్ 2002లో వీరికి నందన( Nandana ) అనే అమ్మాయి జన్మించింది.నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు 2011లో ఒక కచేరిలో పాల్గొనేందుకు చిత్ర దుబాయ్ వెళ్లారు.

అదే సమయంలో నందన స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మరణించింది.ఈ సందర్భంగా కూతురి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.

నువ్వు నాకు భౌతికంగా దూరమైనప్పటికీ, ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు.

నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటావు అంటూ ఆమె ఒక ఎమోషనల్ పోస్టుని రాసుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ అభిమానులు స్పందిస్తూ బాధపడకండి ధైర్యంగా ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

కాగా చిత్ర సింగర్ గా తెలుగులో మాత్రమే కాకుండా ఇంకా చాలా భాషల్లో పాటల్లో పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.పలు పాటల ప్రోగ్రాంలకు న్యాయ నిర్ణతగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube