సాధారణంగా కొందరి దంతాలు( teeth ) తెల్లగా కాకుండా పసుపు రంగులో ఉంటాయి.దంత సంరక్షణ లేకపోవడం, పలు అనారోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు, టీ-కాఫీ-కూల్ డ్రింక్స్ వంటి పానీయాలను అధికంగా తీసుకోవడం, ధూమపానం తదితర కారణాల వల్ల దంతాలపై పసుపు మరకలు ఏర్పడుతుంటాయి.
ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఈ క్రమంలోనే పసుపు దంతాలను వదిలించుకునేందుకు తెగ ట్రై చేస్తూ ఉంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

రెమెడీ 1: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ లవంగాల పొడిని( Clove powder ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ అల్లం పొడి( Ginger powder ), రెండు నుంచి మూడు టీ స్పూన్లు టూత్ పేస్ట్( Toothpaste ), రెండు చుక్కలు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.
రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని ఉపయోగించి బ్రష్ తో దంతాలను సున్నితంగా తోముకుని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఇలా చేశారంటే మీ పసుపు దంతాలు తెల్లగా కాంతివంతంగా మారతాయి.
అదే సమయంలో క్యావిటీస్ ఏర్పడే రిస్క్ తగ్గుతుంది.దంతాల పోటు సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.

రెమెడీ 2: ముత్యాల్లాంటి దంతాలను మీ సొంతం చేసేందుకు మరొక సూపర్ రెమెడీ ఉంది.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని సున్నితంగా తోముకోవాలి.
ఆపై వాటర్ తో నోటిని, దంతాలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన కూడా దంతాలు తెల్లగా మారతాయి.
పసుపు మరకలు తొలగిపోతాయి.






