చాలామందికి ముఖం ఎంత అందంగా కాంతివంతంగా ఉన్నప్పటికీ చేతులు ( hands )మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తుంటాయి.ఎందుకంటే ఎక్కువ పనులు చేసేది చేతులతోనే.
పైగా ఫేస్ విషయంలో తీసుకునే కేర్ చేతుల విషయంలో తీసుకోరు.దాంతో చేతులు కఠినంగా మారుతుంటాయి.
మగవారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఆడవారు మాత్రం తమ చేతులను మృదువుగా అందంగా మెరిపించుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ను అస్సలు మిస్ అవ్వకండి.
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్( Sugar ), వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), రెండు టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చేతులకు, వేళ్ళకు అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి కనీసం రెండు సార్లు ఈ స్క్రబ్ ను యూస్ చేశారంటే చేతులపై పేరుకుపోయిన మురికి మృత కణాలు తొలగిపోతాయి.స్కిన్ అనేది హెల్తీగా మారుతుంది.

అలాగే స్క్రబ్ తో పాటు అప్పుడప్పుడు చేతులకు మాస్క్ కూడా వేసుకోవాలి.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ ( Green tea powder )వేసుకోవాలి.అలాగే అర టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, రెండు టీ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రెండు చేతులకు, వేళ్లకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా చేతులను క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఇలా చేయడం ద్వారా చేతులు మృదువుగా కోమలంగా మారుతాయి.
అందంగా ప్రకాశవంతంగా మెరుస్తాయి.చేతులు త్వరగా ముడతలు పడకుండా ఉంటాయి.

ఇక ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడమే కాకుండా రోజు బాత్ అనంతరం చేతులకు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.అలాగే నైట్ నిద్రించేముందు కొంచెం నెయ్యి తీసుకుని రెండు చేతులకు, వేళ్లకు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మం అనేది మృదువుగా మారుతుంది.కఠినత్వం తగ్గుతుంది.డ్రై స్కిన్ సమస్య కూడా దూరం అవుతుంది.







