జిడ్డు ముఖంతో ఇబ్బందిగా ఉందా? వీటిని ట్రై చేస్తే ఎప్పటికి జిడ్డు సమస్య ఉండదు

చర్మం మీద ఎక్కువగా జిడ్డు ఉంటే మొటిమలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వచ్చి ముఖం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.అలాగే చిరాకు కూడా కలుగుతుంది.

అయితే జిడ్డు చర్మం కలవారిలో వయస్సు పెరిగిన లక్షణాలు తొందరగా కనపడవు.అలాగే చర్మం ముడతలు పడటం కూడా చాల తక్కువగా ఉంటుంది.

జిడ్డు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు.జిడ్డు సమస్య పరిష్కారానికి ఖరీదైన సౌందర్య సాధనాలు ఏమి వాడవలసిన అవసరం లేదు.

మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.వాటి గురించి తెలుసుకుందాం.

నిమ్మరసం

నిమ్మరసంలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ సహజ యాస్ట్రింజెంట్‌లా పనిచేసి జిడ్డు తొలగించటంలో సహాయపడుతుంది.నిమ్మరసంను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నిమ్మరసం,మినరల్ వాటర్ రెండింటిని సమాన భాగాలలో తీసుకోని దానిలో కాటన్ ముంచి ముఖాన్ని తుడవాలి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు

మూడు స్పూన్ల పెరుగులో కొంచెం ఓట్ మీల్ పొడి,తేనే కలిపి ముఖానికి ప్యాక్ వేసి కొంచెం సేపు మసాజ్ చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.

టమోటా

టమోటాలో సహజ యాస్ట్రింజెంట్‌ లక్షణాలు ఉండుట వలన జిడ్డు తొలగించటంలో సహాయపడుతుంది.టమోటా ముక్కను ముఖంపై రబ్ చేసి మర్దన చేయాలి.

యాపిల్

యాపిల్ గుజ్జులో రెండు చుక్కల నిమ్మరసం,కొంచెం పెరుగు వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని స్నానానికి వెళ్లే ముందు ముఖానికి రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో కడగాలి.ఈ విధంగా చేయటం వలన ముఖంపై జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.

కీరదోస

కీరదోసలో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన చర్మానికి పోషణను అందిస్తుంది.కీరదోస రసంలో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ చిట్కాలను పాటిస్తే జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.

Advertisement

తాజా వార్తలు