Wrinkles Remedies : యాబైలోనూ యంగ్‌గా క‌నిపించాల‌నుందా? అయితే ఈ రెమెడీ మీకోస‌మే!

యాబై ఏళ్ళు వచ్చాయంటే చాలు ముడతలు, సన్నని చారలు తదితర వృద్ధాప్య ఛాయలు పనిగట్టుకుని వచ్చి పలకరిస్తుంటాయి.వాటిని రోజు అద్దంలో చూసుకుంటూ ఎంతగానో బాధపడుతుంటారు.

ఈ క్రమంలోనే వృద్ధాప్య ఛాయ‌ల‌ను దాచేసి యంగ్ గా కనిపించేందుకు నానా తంటాలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే యాబై లోనూ యంగ్ గా మెరిసిపోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన రైస్ ను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి ప‌ల్చ‌టి వ‌స్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో ఒక గుడ్డు పచ్చ సోన వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.చివరిగా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ను యాడ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మరియు మెడకు ఏదైనా బ్రష్ సహాయంతో కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు, సన్నని చారలు దూరం అవుతాయి.సాగిన చర్మం టైట్ గా మారుతుంది.వృద్ధాప్య ఛాయ‌లు మాయమై ముఖ‌ చర్మం యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుతుంది.

కాబట్టి య‌బైలోనూ యంగ్‌గా క‌నిపించాల‌ని ఆరాటప‌డే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు