గత కొన్ని నెలలుగా రాష్ట్రానికీ కేంద్రానికి మధ్య సైలెంట్ వార్ జరుగుతుంది.ఇది ఇప్పుడు బాగా ముదిరి ప్రత్యక్ష యుద్ధం గా మారింది.
మొన్నటి వరకూ పరోక్ష పౌరుష మాటలతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.ఇప్పుడిక నేరుగా అయధాలు సందిస్తున్నారు.
కేంద్రం తన అధీనంలోనీ ఈడి , ఐటి జీ యస్ టీ వంటి అస్త్రాలను ప్రయోగిస్తే దాన్ని తిప్పి కొట్టే అస్త్రాలకై రాష్ట్రం అన్వేషిస్తూ ఉంది.మునుగోడు ఎన్నికల సమయంలో తెరాస ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం లేవనెట్టింది.
దాని యొక్క మూల్యం భారీగా చెల్లించుకొక తప్ప లేదు.టీఆర్ఎస్ ప్రభుత్వానికి.
మరో పక్క ఢిల్లీ లిక్కర్ స్కాం లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి టీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో ఇరుకున పెట్టే పనిలో కేంద్రం పడింది.కేంద్రం పన్నే కుట్ర కుతంత్రాలను తిప్పి కొట్టే పనిలో దాదాపుగా టీఆర్ఎస్ నిమగ్నమై పోయిందని రాష్ట్రంలో తాజా రాజకీయ చిత్రం చూస్తే అర్థమవుతుంది.
ఐతే ఇక్కడ విచిత్రం ఏంటంటే.ఇది రాజకీయ నేతల మధ్య జరిగే పోరు లా కాక వ్యక్తి గత కక్షల కొరకు జరిగే యుద్ధంగా సన్నివేశాలు మారుతున్నాయి.
సినిమాలని తలదన్నే ట్విస్ట్ లు, సస్పెన్స్ లు, నటనలు చూసే ప్రజలకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి.కెసీఆర్ కీ మోడీకి మద్య జరిగే వార్ లో రాష్ట్రం మొత్తం బలి కావాలా.? అనే కోణంలో ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని గతంలో ఎన్నోసార్లు కెసీఆర్ కేంద్రం పై నిప్పులు చెరిగారు.
నేనిచ్చిన నిధుల ని రాష్ట్రం పక్క దారి పట్టించిందని మోడీ ఎన్నోసార్లు బహిరంసభలో ప్రకటించారు.ఇలా ఇద్దరూ ఎవరికి వారే ప్రజలను పాలనను పక్కకు నెట్టి వ్యక్తి గత పంతాలకు పోతున్నారు.
అనవసర పంతాలకు పట్టిపులకూ అధికార దుర్విియోగానికి పాల్పడుతున్నారు.

అవినీతి అక్రమ సంపాదన మీద దాడి తప్పకుండా చెయాలి.వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుడడు.అది రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా అవినీతి ని సహించకూడదు.
కానీ ఇంతకాలం ఎందుకు కేంద్రం రాష్ట్రం లో జరుతున్న అవినీతి అక్రమాల పై చర్యలు తీసుకోలేదు.ఇక్కడ కేసిఆర్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం పై గట్టిగా పోరాడుతున్న సమయంలో ఈ ఐటీ దాడులు జరపడం ఏంటని ప్రజలు ఆలోచనలో పడ్డారు.
తాము ఏమీ ఈ దాడులకు బయపడమని తాము ఏసీబీని కేంద్రం పైకి ప్రయోగిస్తామని రాష్ట్రం తాజా గా నిర్ణయం తీసుకుంది.వ్యూహాలు ప్రతివ్యూహాలు కుట్రలు కుంత్రాలతో దేశం మొత్తం రాజకీయంగా బాగా వేడి ఎక్కింది.

ఈ రాజకీయ రచ్చలో గవర్నర్ ను కుడా పావులుగా మార్చుకుని రాష్ట్రాల పై తిరుగు బాటు చేయించడం కడు శోచనీయం విచారకరం.ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎన్నికల్లో వీరి మధ్య పోరాటాలు ఎలా ఉంటాయో అని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.పాలకుల ప్రభుత్వాల పౌరుషలకు ప్రజలు నలిగిపోతున్నారు.ఈ విషయం ఇరువురు గమనించాలి.ఏదీ ఏమైనా ప్రజలు ఇటువంటి అంశాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు.అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి.
ఇకనైనా ఇరువురూ శత్రుత్వాన్ని విడనాడి స్నేహ సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి.ఇది తెలంగాణకి, దేశానికి ఉపయుక్తం అని గుర్తుంచకోవాలి.
లేదంటే రాబోయే ఎన్నకల్లో ప్రజలు వీరికి గట్టిగా బుద్ది చెప్పగలరు.అని గ్రహించి యుద్దానికి చరమ గీతం పాడాలి.