తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది.
ఈ మేరకు సైలెంట్ పీరియడ్ మొదలైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని సీఈఓ వికాస్ రాజ్ సూచించారు.
ఎలాంటి ఎన్నికల మెటీరియల్ ను ప్రదర్శించకూడదని చెప్పారు.అదేవిధంగా ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని తెలిపారు.
సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధమన్న ఆయన సామాజిక మాధ్యమాల్లోనూ ఎలాంటి ప్రచారం చేయొద్దని సూచించారు.ఇప్పటికే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు.
పోలింగ్ బూత్ లకు మొబైల్ అనుమతి లేదని స్పష్టం చేశారు.పోలింగ్ ముగిసిన అరగంట తరువాతే ఎగ్జిట్ పోల్స్ పెట్టాలని, ఓటర్ స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని తెలిపారు.







