తాజాగా సౌత్ ప్రముఖ వేడుకల్లో ఒకటైన సైమా అవార్డ్స్ అంగరంగ వైభవంగా నిన్న రాత్రి బెంగుళూరు లో జరిగాయి.ఇక ఈ వేడుకలో ఎంతో మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈసారి కూడా చాలా ప్రతిభావంతులైన నటీనటులు అవార్డులను అందుకున్నారు.ఇక ఈ వేడుకలో ముఖ్యంగా పుష్ప సినిమా అన్నిటికంటే ఎక్కువ అవార్డులు అందుకుంది.
పుష్ప సినిమా అన్ని విభాగాల్లో అవార్డులను అందుకుని తగ్గేదేలే అంటూ మరోసారి నిరూపించుకుంది.అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.
ఇక సైమా అవార్డ్స్ లో ఈ సినిమాకు చాలా అవార్డులు వరించాయి.
ఉత్తమ సినిమాగా పుష్ప, ఉత్తమ డైరెక్టర్ గా సుకుమార్, ఉత్తమ యాక్టర్ గా అల్లు అర్జున్, ఉత్తమ సహాయ నటుడిగా జగదీశ్ ప్రతాప్ బండారి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ సాహిత్య రచయితగా చంద్రబోస్ లకు పుష్ప సినిమా తరపున అవార్డులు వరించాయి.దీంతో ఈ సినిమా పేరు మరోసారి మారుమోగి పోయింది.

పుష్ప పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.







