భగవంతుని దర్శనం తర్వాత తలపై శఠగోపం పెట్టడానికి అర్థం ఏమిటో తెలుసా..

హిందూ సంప్రదాయంలో పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

చాలా మంది ప్రజలు ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో పూజ చేయడమే కాకుండా గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు.

గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని దర్శించుకున్న వెంటనే పూజారి మనకు దేవుడి ప్రసాదం ఇవ్వడమే కాకుండా తలమీద శఠగోపం పెడుతూ ఉంటారు.అయితే తల మీద ఇలా శఠగోపం ఎందుకు పెడతారు అన్న సంగతి చాలా మందికి తెలియదు.

దేవుడి దర్శనం తర్వాత తలపై శఠగోపం పెట్టడానికి గల కారణం అందులో ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవాలయానికి వెళ్ళిన తర్వాత భక్తులు వారి కోరిన కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.అయితే దేవుడు దర్శనం తర్వాత శఠగోపం పెట్టేటప్పుడు మనం తలవంచుతాము.అయితే నిత్యం మంత్రోచ్ఛారణలతో శక్తివంతమయ్యే స్వామి సన్నిధిలో ఉండే శఠగోపం పూజారి తల పై పెట్టినప్పుడు మనిషికి శత్రువులైన కామము, క్రోధము, మోహము, మదము వంటి వాటికీ ఇకనుంచి దూరంగా ఉంటామని మనసులో తలుచుకొని తల వంచి తీసుకుంటాము.

Advertisement

అంతేకాకుండా శఠగోపం లో పరమాత్ముడు కొలువై ఉంటాడని వేద పండితులు చెబుతున్నారు.సహస్రార చక్రానికి తాకించిన శఠగోపం తలపై పెట్టడం వలన మనలోని కుండలిని శక్తి ప్రేరేపించబడుతుంది.అంతేకాకుండా శఠగోపం పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని బలంగా కోరుకుంటే మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం.

అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తులందరూ తప్పనిసరిగా తలపై శఠగోపం పెట్టించుకుంటారు.ఇలా చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండి మనం కోరిన మంచి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

ఈ శఠగోపం తలపై పెట్టడం వల్ల ఈ జన్మ లభించడానికి కారణమైన పుణ్య కార్యాలను భగవంతుని దర్శనంలో గల మహత్తుని మనకు గుర్తు చేస్తుందని పండితులు చెబుతున్నారు.

మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు