స్టార్ నిర్మాతల్లో మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు .ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా , ట్రెండ్ తగ్గట్టుగా తన బ్యానర్ నుంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే నిర్మాతల్లో దిల్ రాజు ముందు వరుస లో ఉంటారు.
దిల్ సినిమా నుండి మొదలైన సినీ జర్నీ అనుభవంలో దిల్ రాజు ఎప్పుడు పాటించే సిద్ధాంతం ఒక్కటే.సినిమాకు స్టోరీ సెలెక్షన్ అనేది చాలా ముఖ్యం , నా బ్యానర్ నుండి మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాను .ఇక సినిమా విజయం అనేది నా చేతుల్లో లేదు అది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు ,ఇక నిర్మాతగా నా బాధ్యత అంతా స్టోరీ ఒకే చేయడం , కాస్టింగ్ ఫైనల్ చేయడం అవి పూర్తి అయ్యేంతవరకు నా హస్తం ఉంటుంది అదే నా సక్సెస్ జర్నీ.
ఇక అసలు విషయానికి వస్తే .గత ఏడాది డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 3 మూవీ తో బిగ్ సక్సెస్ అందుకున్న దిల్ రాజు , ఆ తరువాత నాగ చైతన్య తో నిర్మించిన థ్యాంక్యూ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేక పోయింది .ప్రస్తుతం దిల్ రాజు చేతిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో ఉన్నాయి .ఈ నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ తో భారీ బడ్జెట్ తో నిర్మించిన వారసుడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది .సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది .మొదట్లో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది,
ఆట నెమ్మది నెమ్మదిగా సినిమా ఊపు అందుకొని ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ,ప్రేక్షకుల దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం వారసుడు మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు దిల్ రాజు , ఒక సినిమా ఆన్ సెట్స్ మీద ఉన్నప్పుడే మరో మూవీ ప్లాన్ చేసి ఎక్స్ క్యూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు .ప్రస్తుతం దిల్ రాజు – పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పొలిటికల్ డ్రామా మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.వారసుడు సినిమా తరువాత దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ రామ్ చరణ్ తో అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఒక మూవీ పూర్తి అయితే గాని ,మరో మూవీ ఎనౌన్స్ చేయని దిల్ రాజు తన నెక్స్ట్ చేయపోయే మూవీ గురుంచి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో బయటకు వచ్చింది .ఇక అది కూడా సెన్సెషనల్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తన నెక్స్ట్ సినిమా ఉంటుంది అన క్లారిటీ కూడా వచ్చింది .
ఇక అలానే వారసుడు మూవీ ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్స్ గురుంచి కూడా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ సినిమా పూర్తి కాగానే తన నెక్స్ట్ సినిమా లైన్ అప్ లో ఉన్నాడు , శంకర్ సినిమా పూర్తి కాగానే కేజీఎఫ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు .ఇక ఈ సినిమా టైటిల్ రావణం అని అని దిల్ రాజు ఎనౌన్స్ చేసారు.అలానే ఈ సినిమాలో నటించే కాస్టింగ్ గురుంచి పేర్లు ఇంకా చెప్పలేదు.
ఈ సినిమాను బెస్ట్ వీఎఫ్ఎక్స్తో రూపొందించబోతున్నట్లు దిల్ రాజు తెలియజేసారు .మరి ఇంతకీ దిల్ రాజు బ్యానర్ నుండి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురుంచి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తే ఎన్టీఆర్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్.
.