హైదరాబాద్ లోని ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.బీజేవైఎం ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.పోలీస్ రిక్రూట్ మెంట్ లో నిబంధనలు సడలించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది.
ఏడు మార్కులు కలపాలనే హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు.ఈ క్రమంలో నిరసన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, బీజేవైఎం నేతల మధ్య నెలకొన్న వాగ్వివాదం తోపులాటకు దారి తీసింది.అనంతరం బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్కు తరలించారు.







