అడవిలో ఉండే క్రూర మృగాలు అంటే చాలా మందికి భయం.‘జూ‘కు వెళ్లినప్పుడు కూడా క్రూర మృగాలు ఉన్న ప్రాంతాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి.ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.అవి అకస్మాత్తుగా మనుషులపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక సర్కస్‌లలో కొందరు ట్రైనర్లు పులులు, సింహాలు, ఏనుగులతో విన్యాసాలు చేస్తుంటారు.ఒక్కోసారి ఆ జంతువులు వారిపై దాడులు చేస్తుంటాయి.
ఇదే కోవలో ఓ ప్రమాదం జరిగింది.సర్కస్‌లో పనిచేస్తున్న ట్రైనర్‌పై వేలాది మంది ప్రజల సమక్షంలోనే పులి దాడి చేసింది.
రింగ్ లోపల, పులి ట్రైనర్‌పై పడి అతని శరీరాన్ని గాయపర్చింది.అంతేకాదు ట్రైనర్ పొట్టపైన కూర్చుని దూకడం ప్రారంభించింది.
దాదాపు రెండు నిమిషాల పాటు పులి అతన్ని కొడుతూనే ఉంది.ఈ సందర్భంగా సర్కస్ షోలో గందరగోళం నెలకొంది.
విషయం ఇటలీలోని లెక్సీ ప్రావిన్స్‌లో జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
పులి అకస్మాత్తుగా దూకుడుగా మారి 31 ఏళ్ల శిక్షకుడు ఇవాన్ ఓర్ఫీపై ఎలా దాడి చేసిందో ఇది చూపిస్తుంది.ఈ దాడిలో, ఇవాన్ మెడ, కాలు మరియు చేతికి లోతైన గాయాలు చేసింది.
ముందు ఉన్న ఓ పులితో విన్యాసాలు చేయిస్తుండగా వెనుక నుంచి మరో పులి వచ్చి అతడిపై దాడి చేసింది.ఏకంగా అతడి పీకను పట్టుకుంది.

ఇతర ఉద్యోగులు ఎలాగో రింగ్ లోపలికి ప్రవేశించి, ట్రైనర్‌ను పులి నుండి విడిపించగలిగారు.మరికొంత సమయం ఉండి ఉంటే పెద్ద అవాంఛనీయ సంఘటన జరిగి ఉండేది.అతను చనిపోయి ఉండేవాడు.పులి దాడిలో తీవ్రంగా గాయపడిన ఇవాన్‌ను ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది.ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు.
సర్కస్ అయినప్పటికీ క్రూర మృగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







