యూకే లో ఆర్థిక సంక్షోభంతో తనమునుకలైపోయింది.ఇప్పటికే ఆ దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది.
అంతే కాకుండా మరో వైపు వైద్య సేవలో సంక్షోభం, జీతాలు పెంచాలని సిబ్బంది సమ్మెకు దిగడం వంటి సమస్యలు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ చిక్కుల్లో పడవేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆ దేశంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ఆ దేశా ప్రధాని సునాక్ మొదటి ప్రసంగం కు సంబంధించిన కొన్ని విషయాలు బయటపడుతున్నాయి.ఈ ప్రసంగంలో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
యూకే లో విద్యార్థులకు 18 సంవత్సరాలు వచ్చే వరకు గణిత బోధనా తప్పనిసరి చేసినట్లు నిర్ణయించారు.జీవితంలో తను పొందిన ప్రతి అవకాశం విద్య వల్లనే లభించిందని అందుకే విద్యను అదృష్టంగా భావిస్తున్నట్లు తన ప్రసంగంలో చెప్పారు.
ప్రతి చిన్నారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రధాని వెల్లడించారు.సరైన ప్రణాళికతో దీనిని అందించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచంలో అత్యుత్తమ విద్య వ్యవస్థతో మనం పోటీ పడలేకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదని చెబుతున్నారు.ప్రస్తుతం 18 సంవత్సరముల నుంచి 19 సంవత్సరంల మధ్య వయసులో ఉన్న సగం మంది యువత గణితాన్ని చదవడానికి ఇష్టం చూపడం లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.మన పిల్లలకు ఇంతకు ముందుతో పోలిస్తే భవిష్యత్తులో ఉద్యోగాలకు నైపుణ్యాల అవసరం తప్పనిసరి అని ఆయన అభిప్రాయ పడినట్లు సమాచారం.ఆ నైపుణ్యాలు లేకుండా వారిని బయటకు పంపించడం వారిని నిరాశకు గురి చేస్తుందని తెలిపారు.
అంతే కాకుండా 18 సంవత్సరాల వయసు వరకు గణితం తప్పనిసరి అని తన ప్రసంగంలో రిషి సునాక్ అభిప్రాయబడినట్లు వెల్లడించారు.







