మార్కెట్లోకి స్పెషల్ సమ్మర్ డ్రింక్... మజ్జిగనే స్పెషల్ గా తీసుకొచ్చిన కంపెనీ!

వేసవి( Summer ) కావడంతో చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా వున్నాయి.అలా సరదాగా బయటకు వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి వుంది.

 Sids Farm Launches Butter Milk Details, The Company , Latest News, Brough,specia-TeluguStop.com

ఇలాంటప్పుడు ఒంట్లో చల్లదనాన్ని నిలుపుకోవడం కోసం పానీయాలు తాగడం తప్పనిసరి.ఒంట్లో వేడిని తగ్గించడానికి మజ్జిగ ( Butter Milk ) ఒక ఔషదంలాగా పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే.

అయితే నేటి దైనందిత జీవితం, పట్టణీకరణ వ్యవస్థలో ఎంత మంది ఇళ్లల్లో మజ్జిగ చేసుకుంటున్నారు అంటే ఒక ప్రస్నార్ధకమే.అందుకే మనకు మార్కెట్లో కొన్ని కంపెనీలు మజ్జిగను విక్రయిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా మన తెలంగాణ కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రీమియం డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ (డీ2సీ) డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌( Sid`s Farm ) నేడు మజ్జిగను మార్కెట్లోకి తీసుకువచ్చింది.సౌకర్యవంతమైన ప్యాకేజింగ్‌లో రాబోతున్న ఈ మజ్జిగ రీసైక్లిబల్‌ 200 మిల్లీ లీటర్ల ఫుడ్‌ గ్రేడ్‌ డిస్పోజల్‌ కప్పులలో ప్యాక్‌ చేయబడి వుంది.20 రూపాయల ధరలో రిటైలర్ల వద్ద వీటిని అందిస్తున్నారు.అన్ని వర్గాల వారికీ ఇది ఈ ధర అందుబాటు ధరలో ఉండటంతో పాటుగా అన్ని వయసుల వారికీ ఇది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.

ఈ మజ్జిగ కావాలంటే హోమ్‌ డెలివరీ ఆప్షన్ కూడా వుంది.హైదరాబాద్‌లో ఈ రోజు బుక్‌ చేసుకుంటే, ఆ తరువాత రోజు సిద్స్‌ ఫార్మ్‌ డీ2సీ ఛానెల్‌ ద్వారా దీనిని డెలివరీ చేస్తారు.అంతేకాకుండా బెంగళూరులో ఇది నిర్ధేశిత ఈ-కామర్స్‌ సైట్స్ లో దొరుకుతుంది.సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ… ”మా మజ్జిగ మిగిలిన సంస్థలకు భిన్నంగా ఉంటుంది.

ఎందుకంటే మా పెరుగు, సహజసిద్ధమైన పదార్ధాలతో తయారు చేయబడుతుంది.ఈ సమ్మర్‌లో శరీరాన్ని కూల్ గా ఉంచుకునేందుకు మంచి ఆప్షన్ ఇది.అంతేకాకుండా రీసైక్లిబల్‌ ప్యాకేజింగ్‌తో ఈ వేసవి పానీయం మీకు అందింస్తున్నాం” అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube